రాఘ‌వేంద్ర‌ రావు చెంప చెళ్లుమ‌నేలా కౌంట‌ర్లు ఇస్తున్న నెటిజన్లు | Sakshi
Sakshi News home page

రాఘ‌వేంద్ర‌ రావు చెంప చెళ్లుమ‌నేలా కౌంట‌ర్లు ఇస్తున్న నెటిజన్లు

Published Sun, Sep 10 2023 10:44 AM

Netizens React On Raghavendra Rao About Chandrababu Comments - Sakshi

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా మాజీ సీఎం చంద్రబాబేనని రుజువైంది. రూ.370 కోట్ల ప్రాజెక్ట్‌ను చంద్రబాబే స్వయంగా ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేయడం గమనార్హం. అనంతరం తన బినామీ ముఠాతో కథ నడిపించి షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇందులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్‌ చేశామని సీఐడీ అధికారులు తెలిపారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: వారంలోనే ఇంటిబాట పట్టిన కంటెస్టెంట్‌!)

ఈ వివాదంపై  సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు స్పందించిన విషయం తెలిసిందే. 'చంద్రబాబు అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్నఅంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి' అని రాఘ‌వేంద్ర‌రావు ట్వీట్ చేశారు. దీంతో రాఘవేంద్ర రావు చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో  పలువురు నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

బాబును అరెస్ట్ చేయ‌డం వల్ల అంబేద్క‌ర్ విగ్ర‌హాలు బాధ ప‌డ‌డం సంగ‌తేమో గానీ..  దివంగత ఎన్టీఆర్ విగ్ర‌హాలు మాత్రం ఆనంద భాష్పాలు రాల్చుతున్నాయ‌ని రాఘ‌వేంద్ర‌రావుకు చెంప చెళ్లుమ‌నేలా నెటిజన్లు కౌంట‌ర్లు ఇస్తున్నారు. చంద్రబాబును మాత్రం గారు అని సంబోధిస్తూ ట్వీట్‌ చేశావ్‌...  మరి అదే ట్వీట్‌లో అంబేద్కర్‌ గారిని మాత్రం 'గారు' అని సంబోధించడానికి మాత్రం తమకు మనుసు రాలేదు కదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.  గ‌తంలో వైశ్రాయ్ హోట‌ల్ ఎదుట ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి, ఆయ‌న్ను ఘోరంగా అవమానించి ప‌ద‌వీచ్యుతుడిని చేసినప్పుడు అంబేద్క‌ర్ రాజ్యాంగం నీకు గుర్తు రాలేదా? అని రాఘ‌వేంద్ర‌రావును నెటిజ‌న్లు నిలదీస్తున్నారు.

ప్రజల్లో మమేకమై తన కష్టంతో అధికారాన్ని తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్ర‌భుత్వాన్ని అన్యాయంగా చంద్రబాబు కూల‌దోసి గ‌ద్దెనెక్కాడు కదా... అప్పుడు మీరు హీరోయిన్ల బొడ్ల‌పై పండ్లు చ‌ల్లుతూ గెస్ట్‌హౌస్‌లలో ఆడుకుంటున్నారా? అని నెటిజన్లు ఉతికేస్తున్నారు. అంతేకాకుండా గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎంపీల‌ను విచక్షణ లేకుండా చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నాడు. వారిలో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చాడు. ఇది రాజ్యాంగ‌బ‌ద్ధ‌మేనా.. అప్పుడు అంబేద్కర్‌ గారు గుర్తుకు రాలేదా..?

కనీసం నీ జీవితంలో ఒక్కసారైనా అంబేద్కర్‌ గారి విగ్రహానికి పూల దండ అయినా వేశావా..? అంటూ పలువురు రాఘవేంద్ర రావును చాకిరేవు పెడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో ఉన్న స్క్రాప్ అంత ఇలా బయటకు వస్తుంది అంటూ  బొడ్డు ద‌ర్శ‌కుడికి నెటిజ‌న్లు  చీవాట్లు పెడుతున్నారు. ఇవన్నీ ఆయన ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Advertisement
Advertisement