‘రాధేశ్యామ్‌’ టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పూజా హెగ్డే

9 Feb, 2021 22:01 IST|Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లకు, రీసెంట్‌గా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రేమికుల రోజున విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ కోసం పూజా హెగ్డే డబ్బింగ్‌ చెబుతున్నారు. ఈ విషయం చెబుతూ.. ఆమె తాజాగా ఓ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌లో ఆమె డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోని కూడా జత చేసింది. ‘ఉదయాన్నే చిత్ర టీజర్‌ కోసం డబ్బింగ్‌ స్టార్ట్‌ చేశాను.. ఫిబ్రవరి 14న టీజర్‌తో వచ్చేస్తున్నాం..'అని పూజా తన ట్వీట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు