Posani Krishna Murali: అప్పటివరకు నాకు సినిమాల మీద ఇంట్రస్ట్ లేదు: పోసాని

7 Apr, 2023 09:00 IST|Sakshi

టాలీవుడ్‌ విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళిది ముందువరుసలో ఉంటారు. అభిమానుల గుండెల్లో అంతలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కమెడియన్‌గా, నటుడిగా, దర్శకనిర్మాతగా, రచయితగా సత్తా చాటిన ఆయన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. ఆయనకు రైటర్‌గా తొలి అవకాశమిచ్చింది పరుచూరి బ్రదర్స్ అని వెల్లడించారు. 

పోసాని మాట్లాడుతూ..' నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లు. ఇప్పటివరకు నా కెరీర్‌లో ఏ ఒక్క మిస్టేక్ చేయలేదు. ఎవరి దగ్గరైనా చిన్న తప్పు కూడా లేదు. నేను నిర్మాతగా చేసినప్పుడు ఇండస్ట్రీలో పెట్టినంతా మంచి భోజనం ఎవరు పెట్టలే. భోజనానికి మహా అయితే రూ.5 లక్షలవుతుంది. కానీ నేను రూ.30 లక్షలు ఖర్చు పెట్టా.  నా కెరీర్ ‍ప్రారంభంలో అవకాశాల కోసం ఫస్ట్ సత్యానంద్‌ దగ్గరికి వెళ్లా. నాలుగేళ్ల తర్వాత రమ్మన్నారు. ఆ తర్వాత మద్రాస్‌లోనే పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లా. మా దగ్గర ఖాళీ లేవు పోమ్మన్నారు. ఆ తర్వాత నేను గేటు దగ్గర నిలబడి ఉండగా గోపాలకృష్ణ అంబాసిడర్ కారు వచ్చింది. ఏం వోయ్ రేపు మార్నింగ్ 5.30 కి రా అని అన్నారు. అయితే 5.30కి ముందే వెళ్లా.' అని అన్నారు.

ఆ తర్వాత మాట్లాడుతూ..' వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఇద్దరు వచ్చారు. బాగా చదువుకున్నట్లున్నావ్ ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా అన్నారు వెంకటేశ్వరరావు. అప్పుడు బీఎన్‌ ప్రసాద్ నిర్మాత. వెంకటేశ్వరరావు నాకు కొన్ని డైలాగ్స్ రాయమని చెప్పారు. అది పేకాట పిచ్చోడు అనే పాత్రకు. ఆయన వచ్చేలోగా 70 డైలాగ్స్ రాశా. అవీ చూసి 50 డైలాగ్స్‌కి టిక్ పెట్టారు. అందులో దాదాపు 35 వరకు సినిమాలో వాడుకున్నారు. డైలాగ్స్ బాగా రాశావ్ అన్నారు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత ఎంఫిల్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. పీహెచ్‌డీ కూడా చేశా. ఫస్ట్ నాకు సినిమాల మీద ప్రేమ లేదు. రైటర్‌గా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేదాకా నాకు నమ్మకం లేదు.'అని అన్నారు. 

మరిన్ని వార్తలు