ప్రభాస్‌ 25వ చిత్రం: అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌..టైటిల్‌ ఇదే.. | Sakshi
Sakshi News home page

Prabhas25: 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌తోనే ప్రభాస్‌ 25వ చిత్రం​

Published Thu, Oct 7 2021 11:24 AM

Prabhas 25th Latest Update: Prabhas Movie With Sandeep Reddy Vanga - Sakshi

Prabhas Announces 25th Film 'Spirit': ప్రభాస్‌ 25వ చిత్రం పై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లోనే ప్రభాస్‌ నటించనున్నారు.ఈ చిత్రానికి ‘స్పిరిట్‌’ అనే పేరు ఖరారు చేశారు. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8  భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం.

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్‌, కొరియన్‌, జపాన్‌ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.ఇప్పటికే బాహుబలి చిత్రంలో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఈసారి పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా మారనున్నారు. ఇలాంటి అరుదైన  రికార్డ్‌ను సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్‌ నిలవనున్నారు.

Advertisement
Advertisement