శివుడిగా ప్రభాస్‌.. పార్వతిగా నయనతార..మంచు విష్ణు ప్లాన్‌ అదుర్స్‌!

24 Sep, 2023 09:18 IST|Sakshi

వరుస పరాజయాలతో ఉన్న మంచు విష్ణు.. తాజాగా ఓ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. తమ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని ఎన్నాళ్లుగానో చెబుతున్న మంచు ఫ్యామిలీ ‘భక్త కన్నప్ప’ను సెట్‌పైకి తీసుకొచ్చారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శివుడి పాత్రలో ప్రభాస్‌ నటించబోతున్నారని మంచు విష్ణు కన్‌ఫర్మ్‌ చేశాడు. 

పార్వతిగా నయన్‌?
భక్త కన్నప్పలో ప్రభాస్‌ నటించబోతున్నారనే వార్త తెలియగానే.. పార్వతి పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. బాలీవుడ్‌ నటి పార్వతిగా నటిస్తోందని మొదట్లో గుసగుసలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం భక్త కన్నప్పలో పార్వతి పాత్రను నయనతార పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో కీలక పాత్ర పోషించే ఓ సీనియర్‌ నటి ఈ విషయాన్ని వెల్లడించింది. మంచు విష్ణు మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. 

అప్పుడు సీత..ఇప్పుడు పార్వతి
భక్తిరస పాత్రలు పోషించడం ప్రభాస్‌, నయన తారలకు కొత్తేమి కాదు. ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించి మెప్పించాడు. శ్రీ రామ రాజ్యం సినిమాలో నయనతార సీతగా కనిపించింది. ఇలా ఇద్దరికీ భక్తిరస పాత్రలు పోషించిన అనుభవం ఉంది కాబట్టి.. శివపార్వతులుగా నటించి మెప్పిస్తారనడంతో ఎలాంటి సందేహం లేదు. పైగా ప్రభాస్‌, నయనతారల పెయిర్‌ కూడా తెరపై బాగుంటుంది. 2007లో వీరిద్దరు కలిసి యోగి సినిమాలో నటించారు. మళ్లీ 16 ఏళ్ల తర్వాత మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌ భక్తకన్నప్ప ద్వారా  జత కట్టబోతున్నారు.

మరిన్ని వార్తలు