హనుకి గ్రీన్‌ సిగ్నల్‌?

20 May, 2023 03:10 IST|Sakshi

ప్రస్తుతం ‘సలార్‌’, ప్రా జెక్ట్‌ కె’, ‘రాజా డీలక్స్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఆ సినిమా చిత్రీకరణలు  తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త సినిమాల కోసం కథలు  వింటున్నారట ప్రభాస్‌. ఇందులో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఓ కథ ప్రభాస్‌కు నచ్చిందని, ఈ కథకు ప్రభాస్‌ ఆల్మోస్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, దీంతో ఈ స్క్రిప్ట్‌కు హను  రాఘవపూడి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా.

అంతేకాదు.. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం ‘రాజా  డీలక్స్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు ప్రభాస్‌. అలాగే ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం జూన్‌ 16న థియేటర్స్‌లో రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు