యాక్షన్‌ బాట పట్టిన టాలీవుడ్‌ హీరోలు, టార్గెట్‌ అదేనట!

12 Apr, 2022 14:05 IST|Sakshi

కేజీఎఫ్‌ 2కు పాన్‌ ఇండియా వైడ్‌గా వస్తోన్న రెస్పాన్స్‌, ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. రాఖీభాయ్‌ స్పీడ్‌ చూస్తుంటే ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. అందుకే తెలుగు హీరోలు కూడా ఇప్పుడు యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత మహేశ్‌ బాబుతో రాజమౌళి మూవీ ఏడాది చివర్లో పట్టాలెక్కనుంది. సూపర్ స్టార్ ను పూర్తిగా యాక్షన్ మోడ్ లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే వీరిద్దరు ఒక స్టోరీని కూడా లాక్ చేసినట్లు సమాచారం.

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి యాక్షన్‌ మూవీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఆ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తో మూవీని కూడా యాక్షన్‌ స్టైల్లో చూపించబోతున్నాడట. ఇప్పటికే కథను రెడీ చేసి తారక్‌కి వినిపించాడట. ఆ స్టోరీకి ఎన్టీఆర్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా అందుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్‌  కూడా యాక్షన్‌ రూట్‌లోకి వెళ్లిపోయాడు. ఆచార్యలో కళ్ల చెదిరే యాక్షన్స్‌ సీన్స్‌తో సర్‌ప్రైజ్‌ చేయనున్నాడు.

ఇక శంకర్ మేకింగ్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా భారీ యాక్షన్ సీన్స్ సర్ ప్రైజ్ చేయనున్నాయట. శంకర్ రేంజ్ తెల్సిందే గా... ఒక యాక్షన్ ఎపిసోడ్ కు 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాడట. మొత్తం టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు ఇఫ్పుడు యాక్షన్ బాట పట్టారు.

మరిన్ని వార్తలు