Bigg Boss 7 Rathika Elimination: రతిక ఎలిమినేషన్.. షోలో విచిత్రమైన రికార్డ్!

1 Oct, 2023 18:28 IST|Sakshi

బిగ్ బాస్ నుంచి రతిక ఎలిమినేట్ అయిపోయింది! ఓ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకెళ్లిపోవడం గురించి ఈ రేంజులో డిస్కస్ చేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా? కారణం ఏంటో తెలీదు గానీ శనివారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో చర్చంతా రతిక గురించే. అయితే ఈమె ఎలిమినేట్ కావడం ఏమో గానీ షో చరిత్రలోనే ఓ విచిత్రమైన రికార్డ్ నమోదైంది.

రతిక ఎలిమినేషన్
బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‪‌గా బరిలో దిగిన రతిక.. తొలివారం అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. కానీ ఆ తర్వాత తర్వాతే ప్రతి విషయంలో లేనిపోని నెగిటివిటీ సంపాదించింది. ప్రశాంత్, యవర్‌తో ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే వాళ్లకు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈమెపై ఉన్న పాజిటివిటీ కాస్త నెగిటివ్ అయిపోయింది. ఫలితంగా ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!)

ఏంటా రికార్డ్?
అయితే బిగ్‌బాస్ షో అబ్బాయిలు, అమ్మాయిలు సమంగా ఉండేలా చూస్తుంటారు. ఎలిమినేషన్ కూడా అందుకు తగ్గట్లే చేస్తుంటారు. ఈసారి మాత్రం వరసగా నాలుగు వారాల్లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. వాళ్లలో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని తొలి మూడు వారాల్లో ఎలిమినేట్ కాగా ఇప్పుడు రతిక హౌస్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇలా తొలి నాలుగు వారాల్లో వరసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోవడం షో చరిత్రలో ఇదే మొదటిసారి. 

కొత్తవాళ్ల రాక
ఇప్పటికే దామిని వెళ్లిపోయింది. రతిక కూడా వెళ్లిపోయింది. దీంతో బిగ్‌బాస్‌లో గ్లామర్ విషయంలో కాస్త కలరింగ్ తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతానికైతే శోభా, శుభశ్రీ అందంతో మేనేజ్ చేస్తున్నారు. వచ్చేవారం కొత్తగా హౌసులోకి నయని పావని, అంజలి పవన్ లాంటి బ్యూటీస్ రాబోతున్నారట. ఇదే నిజమైతే మాత్రం కలరింగ్ పెరుగుతుంది! లేదంటే మాత్రం గ్లామర్ లేక బోసిపోతుంది.

(ఇదీ చదవండి: నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక)

మరిన్ని వార్తలు