Actress Sudha: Powerful Speech At Matru Devo Bhava Movie Press Meet Deets Inside - Sakshi
Sakshi News home page

Matru Devo Bhava: ఇది నా సినిమా అని గర్వంగా చెప్పుకుంటా: సుధ

Published Fri, Feb 4 2022 10:22 AM

Sudha Talk About Matru Devo Bhava Movie - Sakshi

సీనియర్‌ నటి సుధ టైటిల్‌ రోల్‌ చేసిన చిత్రం ‘మాతృ దేవోభవ’. ‘ఓ అమ్మ కథ’ ఉపశీర్షిక. పతంజలి శ్రీనివాస్, అమృతా చౌదరి ïహీరో హీరోయిన్లు. కె. హరనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధ మాట్లాడుతూ.. ‘‘ఇది నా సినిమా అని నేను గర్వంగా చెప్పుకునేలా ‘మాతృ దేవోభవ’ ఉంటుంది.ఫస్ట్ టైమ్ డైరెక్టర్ హరనాధ్ రెడ్డి, ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్స్ చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డిలకు చాలా మంచి పేరు తెస్తుంది. ఇందులో నటించిన, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన "మాతృదేవోభవ" మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు.



నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ... "మాతృదేవోభవ" వంటి మంచి సినిమాతో నిర్మాతలుగా పరిచయమవుతుండడం అదృష్టంగా భావిస్తున్నామని, సుధ గారి కెరీర్ లో ఈ చిత్రం ఓ కలికితురాయిగా నిలుస్తుందని, ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా "మాతృదేవోభవ" చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. హీరో పతంజలి శ్రీనివాస్, ముఖ్యపాత్రధారులు జెమిని సురేష్, చమ్మక్ చంద్ర, శ్రీహర్ష, కీర్తి, సత్యశ్రీ... "మాతృదేవోభవ" సినిమాలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసి, ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. 

Advertisement
Advertisement