ఆ మూవీ అరుదైన రికార్డ్.. ఏకంగా ప్రభాస్, రణ్‌బీర్‌ చిత్రాలను దాటేసి!

8 Jan, 2024 16:58 IST|Sakshi

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. గతేడాది థియేటర్లలో రిలీజైన చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో స్టార్‌ హీరోగా ముద్ర వేసుకున్న విజయ్ దేవరకొండకు.. కోలీవుడ్‌లోనూ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రేక్షకుల అభిమానం పొంది తమిళనాట కూడా తన క్రేజ్ చూపిస్తున్నారు. ఒక్కో సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "ఖుషి" అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2023లో కోలీవుడ్‌లోనే ‍అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ -తమిళ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం కేవలం తమిళనాడులోనే రూ.12.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. షారుక్, నయనతార, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ తర్వాత స్థానంలో నిలిచింది. ఖుషి తర్వాత బ్లాక్‌బస్టర్‌ మూవీలైన సలార్, యానిమల్ చిత్రాలు ఉన్నాయి.

ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ లవ్ అడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కించారు. కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. అంతే కాకుండా గతేడాది టాలీవుడ్ బిగ్ బ్లాక్ బస్టర్స్‌ చిత్రాల్లో ఖుషి ఒకటిగా నిలిచింది.

>
మరిన్ని వార్తలు