Sakshi News home page

చివరి రోజు 19 నామినేషన్లు

Published Sat, Nov 11 2023 1:36 AM

- - Sakshi

ములుగు: ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌కు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. చివరి రోజు శుక్రవారం ఒక్కరోజే 19 సెట్ల నామినేషన్లను పోటీదారులు రిటర్నింగ్‌ అధికారి, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంకిత్‌కు సమర్పించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బడే నాగజ్యోతి మంత్రి సత్యవతి రాథోడ్‌, నాయకులతో కలిసి నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అంకిత్‌కు అందించారు. ముందుగా గట్టమ్మకు పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీగా నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నారు. అలాగే సీతక్క తరఫున నాలుగు సెట్లు, అజ్మీర ప్రహ్లాద్‌ తరఫున రెండు సెట్లు దాఖలయ్యాయి. శుక్రవారం నాటికి మొత్తం నామినేషన్‌లు 28కి చేరుకున్నాయి. ఇందులో ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క తరఫున కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్‌, ఏటూరునాగారం బ్లాక్‌ కాంగ్రెస్‌ ఇరుసవడ్ల వెంకన్న, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మన్‌రావు రెండు సెట్లను, రెడ్కో చైర్మన్‌ సతీష్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పోరిక గోవింద్‌నాయక్‌ మరో సెట్‌ను దాఖలు చేశారు. బీఎస్పీ అభ్యర్థి భూక్య జంపన్ననాయక్‌, ఇండిపెడెంట్‌ అభ్యర్థిగా ములుగు మండలం జీవింతరావుపల్లి గ్రామానికి చెందిన ఆంగోత్‌ తారక్‌, స్వతంత్ర అభ్యర్థిగా మంగపేటకు చెందిన మద్దిల వెంకటేశ్వర్లు, బీజేపీ అజ్మీర ప్రహ్లద్‌ తరఫున కీర్తి అనిశెట్టి, గోండ్వాన దండకారణ్య పార్టీ తరఫున విజయ జ్యోతి బసు, ధర్మ సమాజ్‌వాది పార్టీ తరఫున ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలానికి చెందిన మల్యాల మనోహర్‌, స్వతంత్ర అభ్యర్థిగా ములుగు మండలం కాశిందేవిపేట పంచాయతీ పరిధి రాంనగర్‌తండా భూక్య అమర్‌సింగ్‌, అలయన్స్‌ డెమొక్రటిక్‌ రిఫాంమ్స్‌ పార్టీ తరఫున కొత్తగూడ మండలానికి చెందిన యశ్వంత్‌కుమార్‌ బంగారి, యుగతులసి పార్టీ తరఫున ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలానికి చెందిన పాయం తులసి దేవి, స్వతంత్ర అభ్యర్థిగా మంగపేట మండలానికి చెందిన మడె పూర్ణిమ, స్వతంత్ర అభ్యర్థిగా కాల్వపల్లికి చెందిన బడే విద్యాసాగర్‌, బంగారి నరేష్‌, కాపుల సమ్మయ్య, నామినేషన్‌లు వేశారు.

ముగిసిన గడువు

నియోజకవర్గంలో 28కి చేరిన సంఖ్య

Advertisement

What’s your opinion

Advertisement