'నాకు పెళ్లి కావాలి'.. పిల్ల దొరికేసిందిగా..

2 Apr, 2021 16:13 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కైరానాకు చెందిన అజీమ్‌ మన్సూరి.. వయసు 26. పెళ్లీడొచ్చిన అతడికి పిల్ల దొరకడం లేదట. కారణం అతడు 30 ఇంచుల పొడవు మాత్రమే ఉండటం. దీంతో కాబోయే భార్య కోసం ఐదేళ్లుగా కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలిసిపోయాడు. ఇలా కాదని గత నెలలో ఏకంగా పోలీసులనే సాయం కోరాడు. తనకో మంచి వధువును వెతికిపెట్టమని అభ్యర్థించాడు. ఇంకేముందీ.. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీంతో అతడికిప్పుడు రెండు పెళ్లి ప్రపోజల్స్‌ వచ్చాయి. అందులో ఒకటి ఘజియాబాద్‌కు చెందిన రెహనా అన్సారిది. అతడి హైటే ఉన్న ఈ యువతి అజీమ్‌ను పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నానంటోంది. అంతేకాదు, తనను అర్ధాంగిగా స్వీకరిస్తే.. చేదోడువాదోడుగా ఉంటానంటోంది. ఆమె తండ్రి కూడా ఎలాగైనా ఈ పెళ్లి ఖాయమయ్యేందుకు అబ్బాయి కుటుంబంతో మంతనాలు జరుపుతున్నాడు. ఈ వివాహానికి అబ్బాయి తరపువాళ్లు అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నాడు.

ఇక ఢిల్లీకి చెందిన మరో మహిళ అజీమ్‌తో జీవించేందుకు తహతహలాడుతోంది. "నేను అతడితో ఓ మాట చెప్పాలనుకుంటున్నా. అక్కడ ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఇక్కడ నేనూ ఒంటరిదాన్నే. నేను అతడిని పెళ్లాడాలనుకుంటున్నాను" అని ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ఈ వీడియో అజీమ్‌ వరకు చేరింది. తనకు రెండు సంబంధాలు రావడంతో సంతోషం వ్యక్తం చేసిన అజీమ్‌ ఈ ప్రపంచంలో తనకంటూ ఒకరున్నారని ఆ దేవుడు రుజువు చేశాడని చెప్పుకొచ్చాడు. ఈ రెండు మాత్రమే కాదు పలు చోట్ల నుంచి కూడా అమ్మాయి ఉంది చేసుకుంటారా? అంటూ ఎన్నో సంబంధాలు వస్తున్నాయట.

అయితే అజీమ్‌ ఫ్యామిలీ మాత్రం హాపూర్‌కు చెందిన ఓ యువతితో పెళ్లి ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా చేయనున్నారట. ఈ లెక్కన వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లోనో, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనో జరిగే అవకాశాలున్నాయి.

చదవండి: రోడ్డు మీద బురద నీటిలో బొర్లుతూ స్నానం!

జనం పరుగో పరుగు.. ఇండియన్‌ ఏనుగు అంతే!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు