కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్‌ కార్యకర్తల నిరసనలు | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్‌ కార్యకర్తల నిరసనలు

Published Tue, Mar 26 2024 1:13 PM

AAP Protests Seeking Arvind Kejriwal Release and BJP Wants His Resignation - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. అక్రమంగా ఆయన్ను అరెస్ట్ చేశారంటూ ఆప్‌ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు.. అరవింద్‌ కేజీవ్రాల్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. 

అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఆప్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పలు పోలీసు స్టేషన్లకు తరలించారు.  ప్రధానిమోదీ నివాసం ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ గేరావ్‌ చేపట్టగా.. బీజేపీ కేజ్రీవాల్‌ రాజీనామాను డిమాండ్‌ చేస్తూ..  మెగా మార్చ్‌ను చేపట్టింది. జైలు నుంచి పాలన కొనసాగిస్తాననటం సిగ్గుచేటని బీజేపీ మండిపడుతోంది. బీజేపీ ఫిరోజ్‌ షా  కోట్ల స్టేడియం నుంచి ఢిల్లీ సెక్రటేరియట్‌ వైపు మార్చ్‌ చేపట్టింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

చదవండి: కేజ్రీవాల్‌ రెండో ఆదేశం.. ఈడీ సీరియస్‌

ఆప్‌ కార్యకర్తలకు నిరసన తెలపడానికి అనుమతి లేదని పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు. ‘ఆప్‌ కార్యకర్తలు నిరసనలు చేయటానికి అనుమతి లేదు. పటేల్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌ వద్ద నిరసనకారులు పెద్ద ఎత్తున తరలివస్తారని మాకు సమాచారం ఉంది. అందుకే మేము భద్రతా చర్యలు చేపట్టాము’ అని ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ దేవేశ్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement