Sakshi News home page

Adipurush Controversy: ‘ఆది పురుష్‌’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ!

Published Mon, Jun 19 2023 9:58 AM

Adipurush Controversy Akhil Bharat Hindu Mahasabha - Sakshi

‘ఆదిపురుష్‌’ సినిమా సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా ఉంది. శ్రీరాముడు, సీతామాత, హనుమంతుడు పాత్రలను తప్పుగా చిత్రీకరించారు. అసంబద్ధ డైలాగులతో పవిత్ర భావాలను వక్రీకరించారు. అందుకే ‘ఆది పురుష్‌’ను బ్యాన్‌ చేయాలి’ అంటూ అఖిల భారత హిందూ మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. 

నటుడు ప్రభాస్‌ నటించిన ‘ఆది పురుష్‌’ సినిమాను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ‘ఆది పురుష్‌’ సినిమా స్టార్‌కాస్ట్‌, డైలాగ్‌ రైటర్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌లపై అఖిల భారత హిందూ మహాసభ విమర్శల బాణం సంధించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. 

అఖిల భారత హిందూ మహాసభ ‘ఆదిపురుష్‌’ సినిమా సనాతన ధర్మాన్ని ఘోరంగా అవమానించిందని ఆరోపించింది. రామాయణంలోని ఎంతో ఉన్నతమైన పాత్రలను ‘ఆదిపురుష్‌’ సినిమాలో దిగజార్చారని ఆరోపించింది. ఈ సినిమా కారణంగా రామాయణంపై అందరిలో తప్పుడు భావాలు ఏర్పడేందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని ఆరోపించింది. అందుకే ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు అఖిల భారత హిందూ మహాసభ యూపీలోని హజరత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

ఆదిపురుష్‌ సినిమాను ఉత్తరప్రదేశ్‌లో బ్యాన్‌ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి​ యోగి ఆదిత్యనాథ్‌కు ఆర్‌జేడీ వినతిపత్రం సమర్పించింది. ఈ సినిమాలో వినియోగించిన భాష గౌరవప్రదంగా లేదని ఆర్జేడీ ఆరోపించింది. సనాతన ధర్మంపై మక్కువ గలవారి హృదయాలను ఈ సినిమా గాయపరిచిందని ఆ లేఖలో ఆర్‌జేడీ పేర్కొంది. 

ఇది కూడా చదవండి: ‘ఆది పురుష్‌’ను చీల్చిచెండాడిన ‘టీవీ రాముడు’

Advertisement

What’s your opinion

Advertisement