Sakshi News home page

జీ20 నేతలకు అరకు కాఫీ గిఫ్ట్‌.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్..

Published Thu, Sep 14 2023 9:56 AM

Anand Mahindra On Araku Coffee Being Gifted To G20 Leaders - Sakshi

జీ20 సమ్మిట్‌కు హాజరైన విదేశీ నేతలకు అరకు కాఫీలను కేంద్రం గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనిపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయగల భారతదేశ సామర్థ్యానికి ప్రధాన ఉదాహరణ అరకు కాఫీ అని ప్రశంసించారు. అరకు బోర్డు ఛైర్మన్‌గా ఈ ఘనత తనకు ఎంతో గర్వకారణమని అన్నారు. 

'అరకు బోర్డు ఛైర్మన్‌గా నాకు ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. అరకు కాఫీని గిఫ్ట్‌గా ఇవ్వడంపై నేను ఎక్కువ మాట్లాడలేను. ప్రపంచంలోనే అత్యంత కాఫీ ఉత్పత్తుల్లో ఇండియా అరకు కాఫీ కూడా ఒకటి. ఇది మనకు ఎంతో గర్వకారణం' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. జీ20 సమావేశం నుంచి వెనుదిరుగుతున్న విదేశీ నేతలకు కేంద్రం అరకు కాఫీలను గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియోను షేర్ చేశారు.

అరకు కాఫీ ఎంతో ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు కొండ ప్రాంతాల్లో సేంద్రీయ తోటల్లో దీనిని ఎక్కువగా పెంచుతారు. ప్రత్యేకమైన సుగంధ లక్షణాలు కలిగి రుచికి ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీని గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలోని తూర్పు కనుమలలో ఉన్న సుందరమైన అరకు లోయ పర్యాటకంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. 2008లో ఏర్పాటు చేసిన నంది ఫౌండేషన్ అరకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకుపోవడంలో తోడ్పాటునిచ్చింది.

ఇదీ చదవండి:  భారతదేశాన్ని సూర్యుడు మొదట ముద్దాడే ప్రదేశం.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్‌..

Advertisement

తప్పక చదవండి

Advertisement