ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు | Sakshi
Sakshi News home page

ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు

Published Sun, Jul 16 2023 6:08 AM

Azam Khan sentenced to two-year jail term in 2019 hate speech case - Sakshi

రాంపూర్‌: 2019 నాటి రెచ్చగొట్టే ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌(74)కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు జడ్జి శోభిత్‌ బన్సల్‌ శనివారం ఈ మేరకు తీర్పు వెలువరించారు.

2019 లోక్‌సభ ఎన్నికల వేళ మిలక్‌ కొత్వాలీ ప్రాంతం ఖటనగరియా గ్రామంలో బహిరంగ సభలో చేసిన విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటుపడింది. ఆ తీర్పును సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది. పలు కేసుల్లో దోషిగా ఉన్న ఆజంఖాన్‌ 27 నెలల పాటు జైలులో ఉన్నారు. 2022 మేలో సుప్రీంకోర్టు ఆజం ఖాన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement
Advertisement