Delhi: బోరు బావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు! | Sakshi
Sakshi News home page

Delhi: బోరు బావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు!

Published Sun, Mar 10 2024 9:44 AM

Child Fell Into a 40 Foot Deep Borewell - Sakshi

దేశ రాజధాని ఢిల్లీలోని ఒక బోరుబావిలో చిన్నారి పడిపోయింది. ఈ ప్రమాదం ఢిల్లీ వాటర్‌ బోర్డు ప్లాంట్‌లో చోటుచేసుకుంది. కేశోపూర్ మండి సమీపంలోని ఢిల్లీ వాటర్‌ బోర్డు ప్లాంట్‌లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి పడిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది మాట్లాడుతూ  బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు.

ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ వీర్ ప్రతాప్ సింగ్‌తో పాటు  ఆ శాఖ బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాధిత చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి , చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు.

 

Advertisement
Advertisement