కోర్టు తీర్పులపై బాబు, ఎల్లో బ్యాచ్‌ వక్రభాష్యాలు.. సమాధానం ఇదే.. | Sakshi
Sakshi News home page

కోర్టు తీర్పులపై బాబు, ఎల్లో బ్యాచ్‌ వక్రభాష్యాలు.. సమాధానం ఇదే..

Published Fri, Sep 29 2023 7:25 PM

CJI Chandrachud Key Comments On Court Judgments In India - Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశంలో కోర్టులపై వస్తోన్న విమర్శల సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో కోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు. దీంతో, కోర్టు తీర్పులపై అందరికీ క్లారిటీ ఇచ్చారు. 

ప్రశ్న: కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు?. 
సుప్రీంకోర్టు చీఫ్‌ జడ్జిగా భారతీయ కోర్టులు ఎంత స్వతంత్రంగా పని చేస్తున్నాయి?.
ఒక తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఏమైనా ఒత్తిడులుంటాయా?.

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌: ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. అత్యంత సుదీర్ఘ  సమయం జడ్జిలుగా ఉన్నవారిలో నేనొకరిని. ఈ విషయంలో నేను దేశానికి స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాను. మాపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈ కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు  మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ఈ విషయంలో జడ్జిలందరూ ఒక స్పష్టమైన సూత్రాన్ని నమ్ముతాం. కొన్ని కచ్చితమైన నియమ, నిబంధనలను పాటిస్తాం.

- ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్‌ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. కానీ, ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోం. 

- ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. కొన్ని సార్లు సింగిల్‌ బెంచ్‌లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. 

- ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. భోజనం షేర్‌ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్‌ చేసుకోం. అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. 

- ఒత్తిడి ఉంటుంది. అదేలా అంటే.. అత్యుత్తమమైన న్యాయాన్ని అందించాలన్న ఒత్తిడి ఉంటుంది. మనసు మీద, ఆలోచన మీద ఒత్తిడి ఉంటుంది. మేం నేర్చుకున్న విషయం మీద, మా పరిజ్ఞానం మీద ఒత్తిడి ఉంటుంది. కచ్చితమైన పరిష్కారం కోసం అన్వేషిస్తున్నప్పుడు కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. 

- సుప్రీంకోర్టునే తీసుకోండి. దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చే కేసుల్లో.. చాలా భిన్నమైన కోణాలుంటాయి. 1+1=2 అని చెప్పలేం. మేం ఇచ్చే తీర్పులు ఇవ్వాళ ఒక్క కేసు గురించి కాదు.. భవిష్యత్తులో న్యాయవ్యవస్థ ప్రమాణాల మీద ఆధారపడాలి. ఈ సమాజం భవిష్యత్తులో ఎలా ఉండాలన్నదానికి సుప్రీంకోర్టు తీర్పులు అద్దం పట్టాలి. తీర్పులు ఇచ్చే విషయంలో సమాజం ఎలా స్వీకరిస్తుందన్నదానిపై జడ్జిలకు ఆత్మసమీక్ష ఉండాలి. అది ఒత్తిడి అని చెప్పలేను. అది సత్యాన్వేషణ. అదే నిజమైన పరిష్కారం అని సమాధానమిచ్చారు.

Advertisement
Advertisement