రికార్డ్‌ స్థాయిలో కేసులు: రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

15 May, 2021 13:18 IST|Sakshi

లక్నో: భారత్‌లో కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహమ్మారి తలలు వంచేందుకు అన్ని రాష్ట్రాలు నడుం బిగించాయి. రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌  వంటి కట్టడి చర్యలు చేపడుతున్నారు. తాజాగా కరోనా ఉధృతి పెరుగున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 16 నుంచి 30 వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు. శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి(ఆదివారం) నుంచే లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు కొత్తగా 20,846 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య10,94,802కు చేరింది. మరణాల సంఖ్య 12,993కు పెరిగింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు