Sylvester Dacunha, Creator Of Iconic Amul Girl Is No More - Sakshi
Sakshi News home page

క్రియేటివ్‌ జీనియస్‌ డాకున్హా.. అమూల్‌ గర్ల్‌ ప్రచార రూపకర్త ఇక లేరు

Published Thu, Jun 22 2023 9:34 AM

Creator Of Iconic Amul Girl Campaign Sylvester daCunha No More - Sakshi

అమూల్‌ ప్రచారంలో కీలక పాత్ర పోషించేది.. విపరీతంగా ఆకట్టుకునేది ఆ ఉత్పత్తులపై ఉండే అమూల్‌ గర్ల్‌. ఒకరకంగా ఆ మస్కట్‌ వల్లే  అమూల్‌ ఉత్పత్తులకు దేశవ్యాప్త ప్రచారం దక్కింది కూడా. దశాబ్దాలుగా అమూల్‌ సక్సెస్‌లో తన వంతు పోషిస్తోంది అమూల్‌ గర్ల్‌. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్‌.. ఇక లేదు. 

అడ్వర్టయిజింగ్‌ రంగంలో దిగ్గజంగా పేరున్న సిల్వెస్టర్ డాకున్హా Sylvester daCunha కన్నుమూశారు. అమూల్‌ గర్ల్‌ ప్రచార రూపకర్త ఈయనే. 1960 నుంచి మొదలైన ఈ క్యాంపెయిన్‌  ఒకరకంగా అమూల్‌ ఉత్పత్తుల అమ్మకాల పెరగడానికి దోహదపడింది. ఈయన దగ్గర ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేసిన యూస్టేస్ ఫెర్నాండెజ్ అమూల్‌ గర్ల్‌ మస్కట్‌ను తీర్చిదిద్దారు. అప్పటి నుంచి అమూల్‌ గర్ల్‌ను సందర్భోచితంగా(ఎలాంటి పరిణామం అయినా సరే!) తమ ప్రచారానికి అమూల్‌ వాడుకుంటూ వస్తోంది. 

సిల్వెస్టర్‌ డాకున్హా క్రియేటివ్‌ జీనియస్‌. ఆకర్షణీయమైన, జనరంజకమైన ఎన్నో యాడ్స్‌ను రూపొందించారాయన. చనిపోయేంతవరకూ డాకున్హా కమ్యూనికేషన్స్‌ కంపెనీకి చైర్మన్‌గా కొనసాగారు. మంగళవారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు గుజరాత్‌ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ జయెన్‌ మెహతా ప్రకటించారు. డాకున్హా మరణంతో ఆయన తనయుడు రాహుల్‌ ఇక నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

1966లో అమూల్‌ గర్ల్‌ ప్రపంచానికి పరిచయం కాగా..  అట్టర్లీ బట్టర్లీ అనే ప్రచార నినాదాన్ని రూపొందించారాయన. అది ఇప్పటికీ కొనసాగుతోంది.  సిల్వెస్టర్‌ డాకున్హా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 

1966లో దేశంలోని ప్రతీ ఇంటికి చేరువయ్యేలా అమూల్‌ ఏదైనా కొత్త ప్రచారంతో ముందుకు రావాలనుకుంది. ఆ టైంలో అమూల్‌ యాడ్‌ ఏజెన్సీకి ఎండీగా ఉన్న సిల్వెస్టర్ డాకున్హా.. తన  ఆర్ట్‌ డైరెక్టర్‌ యూస్టేస్ ఫెర్నాండెజ్ సహకారంతో అమూల్‌ గర్ల్‌ మస్కట్‌ను రూపొందించారు. ఆ టైంలో జీసీఎంఎంఎఫ్‌కు చైర్మన్‌గా ఉన్న డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌(క్షీరవిప్లవ పితామహుడు) వాళ్లకు సలహాలు కూడా ఇచ్చారట. అలా అమూల్‌ గర్ల్‌ పుట్టి..  ముంబైలోని రోడ్లపై హోర్డింగ్‌లుగా, బస్సులపైనా ఆ మస్కట్‌గా అమూల్‌కి సరికొత్త ప్రచారం కల్పించి.. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. అయితే అమూల్‌ గర్ల్‌కి 2021లో చిన్నమార్పు చేశారు. మిజోరాంకు చెందిన నాలుగేళ్ల గాయకురాలు ఎస్తర్‌ నమటేను అమూల్‌ గర్ల్‌గా గుర్తించారు.

ఇదీ: ఫోన్‌లతో ఎక్కడపడితే అక్కడ స్కాన్‌ చేస్తాం.. మరి ఆ క్యూఆర్‌ కోడ్‌లు ఎలా పని చేస్తాయో తెలుసా?

Advertisement
Advertisement