బొగ్గు కుంభకోణం: అభిషేక్‌ బెనర్జీకి హైకోర్టులో చుక్కెదురు

22 Sep, 2021 10:03 IST|Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కె దురైంది. మనీల్యాండరింగ్‌ కేసులో ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జారీ చేసిన సమన్లపై స్టే విధించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే, నోటీసులకు సంబంధించి అభిషేక్‌ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజిరా పెట్టుకున్న వినతులను పరిశీలించాలని ఈడీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.

పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న బొగ్గు కుంభకోణంలో మనీల్యాండరింగ్‌ అభి యోగాలపై ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో మంగళవారం జరిగే విచారణకు అభిషేక్, రుజిరా వ్యక్తిగతం హాజరు కావాల్సి ఉంది. 
 

మరిన్ని వార్తలు