లాక్‌డౌన్ పై నిర్మలా సీతారామన్ మరోసారి క్లారిటీ

19 Apr, 2021 15:21 IST|Sakshi

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. దీంతో వలస కార్మికులు తమ స్వంత గ్రామాలకు వెళ్లడానికి రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ కు చేరుకోవడంతో రవాణా ప్రాంతాలన్నీ రద్దీగా మారుతున్నాయి. ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోంది. ఈ కరోనా మహమ్మారి దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిథులతో ఆన్‌లైన్ వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో పరిశ్రమ సంఘాలకు ప్రభుత్వానికి లాక్‌డౌన్ విధించే ఆలోచన లేదని ఆర్థిక శాఖ మంత్రి భరోసా ఇచ్చారు. కోవిడ్-19 కట్టడి కోసం ప్రభుత్వ అన్నీ ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. జీవనోపాధి విషయంలో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోందని ట్విట్టర్‌లో తెలిపింది. అలాగే పారిశ్రామిక అసోసియేషన్ల నుంచి పలు సూచనలు కూడా తీసుకున్నట్లు ఆర్దిక మంత్రి పేర్కొన్నారు. ఇక గత 24 గంటల్లో దేశంలో 2.73 లక్షల కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

చదవండి: 

కరోనా విలయం: ఢిల్లీలో లాక్‌డౌన్‌


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు