వర్షం బీభత్సం.. గోడ కూలి అన్న, చెల్లి దుర్మరణం..

21 Jul, 2021 10:20 IST|Sakshi

సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఎడతెరిపిలేని వర్షంతో ఇంటిపై గోడ కూలి అన్న, చెల్లెలు ఇద్దరూ దుర్మరణం పాలైన సంఘటన నెలమంగల తాలూకా బిన్నమంగల గ్రామంలో చోటుచేసుకుంది. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా సీఎస్‌ పుర గ్రామానికి చెందిన వేణుగోపాల్‌ (22), కావ్య (20) మృతి చెందిన అన్న, చెల్లెలు. ఇద్దరూ విద్యాభ్యాసం నిమిత్తం గ్రామంలోని హనుమంతరాయప్ప అనే వ్యక్తికి చెందిన షీట్‌ ఇంట్లో అద్దెకు ఉన్నారు. సోమవారం రాత్రి ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది.

హఠాత్తుగా ఇంటి పక్కన ఉన్న పెద్ద గోడ కూలి ఇంటి షీట్‌పై పడింది. దీంతో అన్న, చెల్లి ఇద్దరూ శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. ఫైర్‌ సిబ్బంది మృతదేహాలను వెలికితీసారు. ఇదే శిథిలాల కింద పడి మరో వ్యక్తి గాయాలపాలయ్యా డు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు