Sakshi News home page

Chandrayaan 3 Enters Moon Orbit: మరో కీలక ఘట్టం.. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్‌-3.. ఇస్రో ట్వీట్‌

Published Sat, Aug 5 2023 8:06 PM

ISRO Chandrayaan 3 successfully enters Moon orbit - Sakshi

ఢిల్లీ/నెల్లూరు:  భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3లో మరో కీలక ఘట్టం పూర్తైంది. భూకక్ష్య నుంచి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది చంద్రయాన్‌-3. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రవేశపెట్టే దశను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మేరకు ఇస్రో దీనిపై ట్వీట్‌ చేసింది. 

ఇప్పటి నుంచి 18 రోజులపాటు చంద్రుడి కక్ష్యలోనే ఉండనుంది చంద్రయాన్‌-3. అన్నీ సవ్యంగా జరిగితే ఈ నెల 23వ తేదీ లేదంటే 24వ తేదీ.. అదీ కుదరకుంటే 25వ తేదీన చంద్రుడి ఉపరితలం పైకి స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్ దిగుతుంది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO) పంపింది చంద్రయాన్ -3 (Chandrayan-3). చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ కు ఇదే ప్రధానమైన తేడా అని చెప్పింది. గతంలో చంద్రయాన్-2 మిషన్ ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొంది. దీంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు పని చేయకుండా పోయాయి. ఇప్పుడు ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసి జాబిల్లి మీదకు పంపారు.

Advertisement

What’s your opinion

Advertisement