Sakshi News home page

గ్రిడ్‌ వైఫల్యంతో ముంబైలో చీకట్లు

Published Mon, Oct 12 2020 11:03 AM

Major Power Outage In Mumbai - Sakshi

ముంబై : విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ముంబై మహానగరంలో సోమవారం అంధకారం అలుముకుంది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ముంబై నగరంలో కార్యకలాపాలు స్తంభించాయి. విద్యుత్‌ అంతరాయంతో మెట్రో, సబర్బన్‌ రైళ్లు నిలిచిపోయాయి. మహానగరంలో భారీ స్ధాయిలో విద్యుత్‌ వ్యవస్థ వైఫల్యం అసాధారణమైనదిగా చెబుతున్నారు. నగరానికి విద్యుత్‌ సరఫరా వైఫల్యంతో ఈ పరిస్థితి నెలకొందని, అసౌకర్యానికి చింతిస్తున్నామని బృహన్‌ ముంబై విద్యుత్‌ సరఫరా పంపిణీ వ్యవస్థ (బెస్ట్‌) ట్వీట్‌ చేసింది.

గ్రిడ్‌ వైఫల్యంతో ఈ పరిస్థితికి దారితీసిందని పేర్కొంది. ముంబైతో పాటు పరిసర థానే, పాల్ఘడ్‌,రాయ్‌గఢ్‌ జిల్లాల్లోను విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు విద్యుత్‌ వైఫల్యంతో ఆస్పత్రులపై ఎలాంటి ప్రభావం లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఇక నగరంలో చీకట్లు అలుముకోవడంతో ముంబై వాసులు సోషల్‌ మీడియాలో సంబంధిత అధికారుల తీరును ఎండగట్టారు. విద్యుత్‌ సరఫరా అందరికీ నిలిచిపోయిందా..? అసలు ముంబైలో ఏం జరుగుతోందని అంటూ ఓ యూజర్‌ ట్వీట్‌ చేశారు. ముంబై నగరం అంతటా విద్యుత్‌ సరఫరా లేదు..దీన్ని ఎవరూ భరించలేరంటూ మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. చదవండి : మీ ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు భద్రం

Advertisement

What’s your opinion

Advertisement