Sakshi News home page

కీలక నిర్ణయం.. ఇకపై ఖరీదైన పెళ్లిళ్లు, వేడుకలు వద్దు!

Published Sun, Apr 9 2023 3:10 PM

Rajasthan: Royal Wedding Terahvi Bhoj Ban By Bhilwara Jat Community - Sakshi

జైపూర్‌: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన వేడుక. ఇద్దరు వ్యక్తులు కలిసి ఏడడుగులు నడిచి జీవితాంతం ఒక్కటిగా ఉండాలని తెలిపే వేడుక వివాహం. అందుకే యువత వివాహం అనగానే, ఫోటో షూట్‌, సంగీత్‌, అంటూ బోలెడు ప్లాన్‌లు చేసుకుంటారు. దీని కోసం వాళ్లు ఎంతటి ఖర్చైన చేయడానికి వెనుకాడరు. ఇంకొందరైతే తమ స్థోమతకు మించి అప్పులు చేసి మరీ ఘనంగా జరుపుకుంటారు. వివాహం అనంతరం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వీటికి చెక్‌ పెట్టాలనే ఉద్దేశ్యంతో భిల్వారా జిల్లాకు చెందిన జాట్ కమ్యూనిటీ పెళ్లి వేడుకల నిర్వహణపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా, రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ భిల్వారా ఆధ్వర్యంలో జాట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. దీని ప్రకారం.. రాజస్థాన్ మేవార్ జాట్ మహాసభ ప్రధాన కార్యదర్శి శోభరామ్ జాట్ మాట్లాడుతూ సమాజంలో ఎక్కువగా జరుగుతున్న పెళ్లిళ్లు, ఇతర ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారు. వివాహాలతో పాటు ఇతర వేడుకలలో.. మౌసర్‌లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. వీటితో పాటు కార్యక్రమాలకు హాజరుకావాల్సిన సంఖ్యను కూడా పరిమితి చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై గరిష్టంగా 500 నుంచి 700 మంది పురుషులు హాజరుకావచ్చు.

అంతే కాకుండా నగదు పరంగా కూడా కొన్ని పరిమితులు విధించుకున్నారు. వీటితో పాటు పెళ్లికి భారీ మొత్తంలో వెచ్చిస్తున్న ఖర్చుకు అడ్డుకట్ట వేస్తూ సమాజంలో సామూహిక వివాహాలను ప్రోత్సహించనున్నారు. అదే విధంగా.. ఇతర వేడుకల విషయంలో కూడా ఆయా కుటుంబాలు వారికి తాహాతులో ఖర్చు చేయాలని కమిటీ సూచించింది.

Advertisement

What’s your opinion

Advertisement