చిన్ననాటి గురువు ఇంటికి వెళ్లిన ఉపరాష్ట్రపతి

23 May, 2023 05:47 IST|Sakshi

కన్నూర్‌(కేరళ): ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ సోమవారం కేరళలో కన్నూర్‌ జిల్లాలోని పన్నియన్నూర్‌ గ్రామానికి వెళ్లారు. చిత్తోఢ్‌గఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో తన గురువైన రత్న నాయర్‌ను కలుసుకున్నారు.

అత్యున్నత స్థాయిలో తమ ఇంటికి వచ్చిన శిష్యుడిని చూసిన ఆమె పొంగిపోయారు. ఇంతకు మించిన గురుదక్షిణ ఇంకేముంటుందంటూ ఆనందించారు. వారిద్దరూ నాటి ఘటనలను గుర్తు తెచ్చుకుంటూ గడిపారు.

మరిన్ని వార్తలు