ఎన్‌ఐఏ అధికారులపై దాడి.. గవర్నర్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

ఈ తరహా ‘గూండాయిజం’ సరైంది కాదు.. ఎన్‌ఐఏ అధికారులపై దాడిని ఖండించిన గవర్నర్‌

Published Sat, Apr 6 2024 6:21 PM

West Bengal Governor Cv Ananda Bose Condemned Recent Attack On Nia - Sakshi

కోల్‌కతా : యాంటీ టెర్రర్‌ ఏజెన్సీ ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులపై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఖండించారు. 

ఎన్‌ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలను బెదిరించే ఇటువంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని, వాటిని పరిష్కరించాలని బోస్ పేర్కొన్నారు. పరిస్థితులను ఎదుర్కోవడంలో వేగంగా, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఈ రకమైన ‘గూండాయిజం’ సరైంది కాదని పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు.  

2022లో బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మరణించడంపై ఎన్‌ఐఏ అధికారులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా బాంబు పేలుడు ఘటనకు సంబంధం ఉన్న మిడ్నాపూర్ జిల్లా భూపతినగర్‌ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు మోనోబ్రోటో జానా, అతని సహచరులను అదుపులోకి తీసుకున్నారు. తిరిగి వస్తున్న ఎన్‌ఐఏ అధికారులపై స్థానికులు దాడి చేశారు.అధికారుల వినియోగించిన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక అధికారి గాయపడ్డారు. 

Advertisement
Advertisement