List Of Top 5 World Most Genocides In History, Know Stories About Them - Sakshi
Sakshi News home page

Genocide: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే...

Published Wed, Jun 14 2023 10:17 AM

Worlds 5 Biggest Genocides - Sakshi

మారణహోమం అనేది మానవత్వాన్ని సమూలంగా మంటగలిపే దుశ్చర్య.  1941లో జరిగిన హోలోకాస్ట్‌ మారణహోమం ప్రపంచంలోనే అతిపెద్దదని చెబుతారు.  ఈ ఘటనకు 82 ఏళ్లు దాటాయి. జర్మన్‌ నియంత హిట్లర్‌ సారధ్యంలో జరిగిన ఈ దారుణ మారణ హోమంలో ఏకంగా 60 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇంతేకాదు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సందర్భాలలో మారణహోమాలు చోటు చేసుకున్నాయి. వాటిలో అత్యంత భీకరమైన 5 మారణ హోమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

హోలోకాస్ట్‌లో 60 లక్షల యూదులు...
1939లో జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధానికి కాలుదువ్వింది.  హిట్లర్ యూదులనందరినీ తుదముట్టించడానికి తన వ్యూహాలను అమలు చేశాడు. 1941లో ఆష్విట్జ్‌లోని నాజీ హోలోకాస్ట్ సెంటర్‌లోని హిట్లర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి యూరప్‌లోని పలు దేశాల నుండి యూదులను తీసుకువచ్చారని చెబుతారు. తరువాత వృద్ధులను, వికలాంగులను గ్యాస్ ఛాంబర్లలో పెట్టి హత్య చేశారు. వీరి గుర్తింపు పత్రాలన్నింటినీ ధ్వంసం చేసి, వారి చేతులపై ప్రత్యేక గుర్తును వేశారు. ఈ శిబిరంలో యూదులను నాజీ సైనికులు రకరకాలుగా హింసించేవారు. వారు యూదులకు శిరోముండనం చేసేవారు.

చాలీచాలనంత ఆహారం ఇచ్చేవారు. విపరీతమైన చలిలో కూడా వారికి ధరించడానికి దుస్తులు ఇచ్చేవారు కాదు. వీరిలో ఎవరైనా అనారోగ్యం పాలయినా లేదా పని చేయలేని స్థితిలో ఉన్నా వారిని గ్యాస్ ఛాంబర్‌లో ఉంచేవారు. లేదా కొట్టి చంపేవారు.  ఖైదీలకు బహిరంగ శిక్ష విధించేవారు. తద్వారా అక్కడున్న ఇతరులను భయాందోళనలకు గురిచేసేవారు. హోలోకాస్ట్‌లో సుమారు 60 లక్షల యూదులు హత్యకు గురయ్యారని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. ఇది నాటి యూదుల జనాభాలో మూడింట రెండు వంతులని చరిత్ర చెబుతోంది. 

కంబోడియా మారణహోమం
దక్షిణ అమెరికా దేశమైన కంబోడియాలో 1970వ దశాబ్ధంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పోల్ పాట్ నాయకత్వంలో ఖైమర్ రూజ్ పాలనలో ప్రజలపై విపరీతమైన దౌర్జన్యాలు జరిగాయి. 1975 నుంచి 1979 సంవత్సరాల మధ్య సుమారు 20 లక్షల మంది మరణించారు. ఈ సంఖ్య నాటి కంబోడియా మొత్తం జనాభాలో నాలుగింట ఒక వంతు అని చెబుతారు. పాల్ పాట్, ఖైమర్ రూజ్‌లకు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, దాని నియంత మావో జెడాంగ్ మద్దతు పలికారు.

ఖైమర్ రూజ్‌కు 90 శాతం విదేశీ సహాయం చైనా నుండి వచ్చినట్లు అంచనాలున్నాయి. ఇందులో ఆర్థిక, సైనిక సహాయం కూడా ఉంది. ఏప్రిల్ 1975లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఖైమర్ రూజ్.. అల్ట్రా-మావోయిజం విధానాల ఆధారంగా సాంస్కృతిక విప్లవం ద్వారా దేశాన్ని సోషలిస్ట్ అగ్రేరియన్ రిపబ్లిక్‌గా మార్చడానికి ప్రయత్నించారు. అధిక పని, ఆకలి, పెద్ద ఎత్తున మరణశిక్షల కారణంగా ఈ పాలనలో సుమారు 20 లక్షల మంది మరణించారు. అయితే 1978లో వియత్నామీస్ సైన్యం దాడి చేసి ఖైమర్ రూజ్ పాలనను అంతమొందించడంతో ఈ మారణహోమం ముగిసింది.

ఇది కూడా చదవండి: పళ్లను చూసి పెళ్లాడేస్తారు..

రష్యా సర్కాసియన్ మారణహోమం
1864లో రష్యా  సారధ్యంలో సర్కాసియన్ మారణహోమం చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల పాటు జరిగిన ఈ మారణహోమంలో రష్యా సైన్యం సాగించిన దురాగతాల కారణంగా 2.5 మిలియన్ల మంది మరణించారు. ఆ సమయంలో 90 శాతం సర్కాసియన్ ప్రజలు రష్యా సైన్యం చేతిలో హతమయ్యారు. కొందరు తరిమివేతకు గురయ్యారు. నాటి రష్యా సైన్యం దురాగతాలు గుర్తుకు వచ్చినప్పుడు ఇప్పటికీ ఆక్కడి ప్రజలు భయంతో వణికిపోతారు.

నాటికాలంలో రష్యన్ సైనికులు సిర్కాసియన్ గర్భిణుల కడుపులను చీల్చి, లోపలి శిశువులకు బయటకు తీసేవారని చెబుతారు. ఇంతోకాదు గర్భిణుల కడుపులోని పిండాలను బయటకు తీసి కుక్కల ముందు విసిరేవారని చరిత్ర చెబుతోంది.  రష్యన్ జనరల్ గ్రిగరీ ఇక్కడి ప్రజలపై ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలు చేసేవాడు. తన ప్రయోగాలలో ఏదైనా విఫలమైనప్పుడు, అతను వారిని చంపేసేవాడు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఇక్కడి ప్రజలు ఆశ్రయం కోసం పొరుగు దేశమైన టర్కీకి పారిపోయేవారు. 

ఆర్మేనియన్ మారణహోమం
ఆర్మేనియా, ఇతర చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం 1915లో ఒట్టోమన్ సైన్యం 15 లక్షల మందిని హత్యచేసింది. ఇది ఆర్మేనియా, టర్కీ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో లక్షలాది యూదుల ఊచకోత, వారిపై జరిగిన దురాగతాల గురించి ఎంత చర్చ జరిగిందో, మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన ఆర్మేనియన్ పౌరులు గురించి ఆ స్థాయిలో చర్చ జరగకపోవడం విశేషం.

ఆర్మేనియా ప్రజలపై తాను పాల్పడిన విధ్వంసానికి టర్కీ ఏనాడూ బహిరంగంగా క్షమాపణలు చెప్పలేదు. దీనికి విరుద్ధంగా టర్కీకిచెందిన ఇస్లామిక్ నియంత రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమధ్య ఆర్మేనియాపై జరిగిన యుద్ధంలో అజర్‌బైజాన్‌కు మద్దతు పలికారు. అజర్‌బైజాన్‌కు అవసరమైన అన్ని సహాయాలను అందించారు. ఇది ఆర్మేనియన్ సైన్యానికి భారీ నష్టాన్ని కలిగించింది.

బోస్నియా మారణహోమం
ఒక అంచనా ప్రకారం ఈ మారణకాండలో బోస్నియా సెర్బ్ సైనికులు ఏకంగా 8 వేల మంది ముస్లింలను హత్యచేశారు. మృతులలో ఎక్కువ మంది 12 నుంచి 77 ఏళ్ల మధ్య వయసు వారేకావడం విశేషం. ఈ ఊచకోత చాలా భయంకరంగా సాగింది. చాలా మంది ప్రజలను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో (నుదుటి మధ్య) కాల్చారు. ఈ ఊచకోత తరువాత బోస్నియా మాజీ సెర్బ్ కమాండర్ జనరల్ రాట్కో మ్లాడిక్  కసాయిగా పేరొందాడు.

1992లో యుగోస్లేవియా విడిపోయిన సమయంలో బోస్నియన్ ముస్లింలు, క్రొయేషియన్లు స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణకు అనుకూలంగా ఓటు వేశారు. సెర్బియన్లు దీనిని బహిష్కరించారు. కొత్త దేశం ఎలా ఏర్పడుతుందనే అంశంపై సెర్బ్ సమాజం- ముస్లిం సమాజం మధ్య వివాదం చెలరేగింది. ఆ సమయంలో సెర్బ్‌లు, ముస్లింలకు మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఇరువర్గాలు తుపాకులతో దాడికి తలపడ్డాయి. ఈ అంతర్యుద్ధంలో వేలాది మంది మరణించగా లక్షలాదిమంది వలసబాట పట్టారు. 

ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య  సేవలు అందించే ఎక్స్‌ప్రెస్‌ రైలు

Advertisement
Advertisement