● షార్ట్‌ ఫిలిమ్స్‌తో సత్తా చాటుతున్న జిల్లా వాసులు ● షూటింగులు అన్నీ ఇక్కడే.. ● లొకేషన్లకు అనువైన ప్రాంతాలెన్నో.. ● నిర్మాత, దర్శకులు, నటులూ జిల్లావాసులే... ● యూట్యూబ్‌ వేదికగా విడుదలచేస్తూ.. ఆదరణ పొందుతూ.. | Sakshi
Sakshi News home page

● షార్ట్‌ ఫిలిమ్స్‌తో సత్తా చాటుతున్న జిల్లా వాసులు ● షూటింగులు అన్నీ ఇక్కడే.. ● లొకేషన్లకు అనువైన ప్రాంతాలెన్నో.. ● నిర్మాత, దర్శకులు, నటులూ జిల్లావాసులే... ● యూట్యూబ్‌ వేదికగా విడుదలచేస్తూ.. ఆదరణ పొందుతూ..

Published Sun, Aug 13 2023 1:20 AM

- - Sakshi

e అందమైన లొకేషన్లు..

నిర్మల్‌ జిల్లాలో షార్ట్‌ ఫిల్మ్‌లు, సినిమా షూటింగ్స్‌కు అనువైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. సహ్యాద్రి పర్వతశ్రేణులు, కొండలు, గుట్టలు, సెలయేళ్లు, జలపాతాలు, ప్రాజెక్టులతోపాటు.. గ్రామాల్లోని పురాతన భవనాలు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే పల్లె వాతావరణం ఇలా చిత్రీకరణకు అనువైన ప్రదేశాలు ఎన్నోఉన్నాయి. ఇక్కడివారు తమ స్వస్థలాల్లోనే షూటింగ్‌కు అనువైన ప్రాంతాలను ఎంచుకొని తగిన కథాంశంతో లఘు చిత్రాలు, సినిమా షూటింగ్‌లు చేస్తున్నారు. అందమైన లొకేషన్లలో ఇటీవల ఈ షూటింగ్‌లు పెరిగాయి. సినిమాపై మక్కువ ఉన్న కళాకారులు తమస్థాయి బడ్జెట్లో షార్ట్‌ ఫిల్మ్‌లు తీసి యూట్యూబ్‌ వేదికగా వీక్షకులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో జిల్లాకు చెందిన కళాకారులు, దర్శకులు, నిర్మాతలు తమ అభిరుచి మేరకు లఘు చిత్రాలు తీసి విడుదల చేస్తున్నారు. వీక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు.

e యూట్యూబ్‌ వేదికగా విడుదల...

ఔత్సాహిక దర్శక నిర్మాతలు, కళాకారులు తాము తీసిన షార్ట్‌ఫిల్మ్‌లను యూట్యూబ్‌ వేదిక ద్వారా ప్రత్యేక చానెల్‌ ఏర్పాటు చేసుకుని విడుదల చేస్తున్నారు. ఇందులో నిర్మల్‌ జిల్లాకు చెందిన తెలుగు సినిమా ప్రపంచం, తెలుగు పంచ్‌, ఎంఎం క్రియేషన్స్‌, తదితర యూట్యూబ్‌ చానల్స్‌ ప్రసిద్ధి చెందాయి. వీటికి వీక్షకుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఆర్థికంగా డబ్బులు వెచ్చించి నాణ్యతతో కూడిన లఘు చిత్రాలు, ప్రత్యేక గేయాలను చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. యూట్యూబ్‌ సామాజిక మాధ్యమం అత్యంత వేగంగా వీక్షకులకు చేరువ కావడంతో నిర్మాత దర్శకులు ఇలాంటి చిత్రాలను విరివిగా విడుదల చేస్తున్నారు.

Advertisement
Advertisement