ఏజెన్సీ టు ఎర్రకోటకు | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ టు ఎర్రకోటకు

Published Tue, Aug 15 2023 12:20 AM

జుగ్నాక గణపతిరావు, కమల దంపతులు - Sakshi

● గిరిజన దంపతులకు అరుదైన గౌరవం ● పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం

లక్ష్యంతో పని చేశాం

ఏజెన్సీ ప్రాంతంలోని రైతుల కష్టాలను గుర్తించాం. సరైన సహకారం లేకపోవడంతో గిరిజనులు దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. రైతులు ఉత్పత్తిదారులుగా మారాలనే ఉద్దేశంతో ‘భూసంపద రైతు ఉత్పత్తిదారుల సంఘం’ ఏర్పాటు చేశాం. నేను చైర్మన్‌గా అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయగలి గాను. వచ్చే ఏడాది నుంచి రైతులకు సంఘం ద్వారా మరింత మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తాం. కేంద్రం గుర్తించి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం రావడం ఆనందంగా ఉంది.

– జుగ్నాక గణపతిరావు, కమల దంపతులు

నార్నూర్‌: దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద మంగళవారం నిర్వహించే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనాలని గిరి దంపతులకు కేంద్రం ఆహ్వానం అందించింది. మండలంలోని గుండాల గొండుగూడ గ్రామానికి చెందిన జుగ్నాక గణపతిరావు, కమల దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. ఈ వేడుకల్లో పాల్గొనడం, ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం పొందడంపై వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దంపతుల సేవలు గుర్తించి కేంద్రం అజాదికా అమృత్‌ మహోత్సవంలో భాగంగా వారిని ఆహ్వానించడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుండాల గొండుగూడ నుంచి..

గుండాల గొండుగూడకు చెందిన జుగ్నాక గణపతిరావు, కమల దంపుతులు సాధారణ రైతులు. వారికి ఉన్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వ్యవసాయంలో తమతోపా టు తోటి రైతుల కష్టాలు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. రైతు ఉత్పత్తిదారులుగా మారితే తప్పా వ్యవసాయం లాభసాటిగా మారదని నిర్ణయించుకున్నారు. 22 జూలై 2001లో ‘భూసంపద రైతు ఉత్పత్తి దారుల సంఘం’ ఏర్పాటు చేశారు. 10 మంది రైతుల సభ్యులతో ప్రారంభమై చు ట్టూ గ్రామాల రైతులు ఇందులో చేరడంతో వీరి సంఖ్య 350కు చేరింది. చైర్మన్‌గా గణపతిరావు మిగతా రైతులతో కలిసి బో ర్డును ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయడంతో కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు.

కేంద్ర ప్రభుత్వం..నాబార్డు సంస్థ అండ..

‘భూ సంపద రైతు ఉత్పత్తిదారుల సంఘం’ ద్వారా రైతులకు అందిస్తున్న సేవ కార్యక్రమాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, నాబార్డు సంస్థ వారికి అండగా నిలిచింది. మండల కేంద్రంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సిబ్బందిని నియమించి సంఘానికి కావల్సిన ఆధునిక పనిముట్లు, ఎరువులు, విత్తనాలు, టార్పాలిన్‌ కవర్లు, వ్యవసాయానికి కావల్సిన పెట్టుబడి రుణాలు అందించారు. వ్యవసాయ శాఖ నుంచి మూడు అనుమతి లైసెన్స్‌లు పొందారు. దీంతో పంట ఉత్పత్తిదారులుగా మారాలనే గణపతిరావు, కమల దంపతుల కృషి ఫలించింది.

Advertisement
Advertisement