మెడికల్‌ కాలేజీకిముహూర్తం | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీకిముహూర్తం

Published Fri, Sep 8 2023 12:54 AM

ప్రారంభానికి సిద్ధమైన మెడికల్‌ కాలేజీ - Sakshi

● 15న ‘వర్చువల్‌’గా ప్రారంభించనున్న సీఎం ● రేపటితో కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి ● ఇప్పటి దాకా 94 మందికి సీట్లు ● 16 నుంచి ‘పరిచయ’ తరగతులు

నిర్మల్‌: నిర్మల్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఈనెల 15న ప్రారంభంకానుంది. హైదరాబా ద్‌ నుంచి సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా కొత్త మె డికల్‌ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని భీమన్నగుట్ట సమీపంలో నిర్మించిన వైద్యకళాశాలనూ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాల కో సం చేపట్టిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ గురువారమే పూర్తికాగా, వైద్యాధికారులు శుక్రవారం సా యంత్రం వరకు ఒకరోజు పొడిగించారు.

94 సీట్లు భర్తీ..

నిర్మల్‌ మెడికల్‌ కళాశాలలో వందసీట్ల కోసం చేపట్టిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. శుక్రవారం సాయంత్రంతో మొత్తం పూర్తికానుంది. మొత్తం వంద సీట్లకు ఆలిండియా కోటాలో పది సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఇక రాష్ట్రకోటాలో 90 సీట్లకు 84 సీట్లు భర్తీ చేశారు. ఇంకా రాష్ట్ర కోటాలో ఒకటి, ఆలిండియా కోటాలో ఐదు సీట్లు మిగిలాయి. వీటి భర్తీకి శుక్రవారం సాయంత్రం వరకు గడువు ఉంది.

16 నుంచి క్లాసులు..

ఈనెల 15న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వర్చువల్‌ విధానంలో మెడికల్‌ కాలేజీని ప్రారంభించనున్నారు. అనంతరం 16 నుంచి కళాశాలలో కొత్త విద్యార్థులకు పక్షం రోజులపాటు పరిచయ(ఇంట్రడక్షన్‌) తరగతులు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ ఒకటి నుంచి రెగ్యులర్‌ క్లాసులు ప్రారంభించనున్నట్లు వైద్యకళాశాల అధికారులు పేర్కొన్నారు.

ప్రారంభానికి సిద్ధం..

మెడికల్‌ కాలేజీలకు సంబంధించి రేపటితో కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి కా నుంది. కళాశాలను ఈనె ల 15న వర్చువల్‌ విధానంలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అనంతరం 16 నుంచి ఇంట్రడక్షన్‌ క్లాసులు, వచ్చేనెల ఒకటి నుంచి రెగ్యులర్‌ క్లాసులు ప్రారంభమవుతాయి. – జేవీడీఎస్‌ ప్రసాద్‌,

ప్రిన్సిపాల్‌, వైద్యకళాశాల

1/1

Advertisement
Advertisement