ప్రలోభపెడితే ఫిర్యాదు చేయాలి | Sakshi
Sakshi News home page

ప్రలోభపెడితే ఫిర్యాదు చేయాలి

Published Fri, Nov 3 2023 1:34 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ - Sakshi

● కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేలా నగదు, బహుమతులు, అక్రమంగా మద్యం సరఫరా చేయకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. ఎక్కడైన ప్రలోభ పెడుతున్నట్లు తెలిస్తే సి–విజిల్‌ యాప్‌ ద్వారా లైవ్‌ లొకేషన్‌తో ఫిర్యాదు చేయాలని సూచించా రు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో గురువారం సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల పేరు మార్పు, లొకేషన్‌కు సంబంధించి, పోలింగ్‌ కేంద్రాల్లో 1500 మంది ఓటర్ల కంటే ఎక్కువ న మోదు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నుంచి నామినేషన్‌ ప్రక్రియ మొదలు కానున్న దృష్ట్యా ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

Advertisement
Advertisement