ప్రకృతి వైద్య దినోత్సవంపై ఉపన్యాస పోటీలు | Sakshi
Sakshi News home page

ప్రకృతి వైద్య దినోత్సవంపై ఉపన్యాస పోటీలు

Published Fri, Nov 17 2023 1:00 AM

గెలుపొందిన విద్యార్థుల తో డీఈవో రవీందర్‌రెడ్డి  - Sakshi

నిర్మల్‌ రూరల్‌: గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, సిద్ధార్థ యోగ విద్యాలయం, జిల్లా సాంఘికశాస్త్ర ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ‘మానవ జీవన విధానంలో ప్రకృతి పాత్ర’ అనే అంశంపై దాదాపు 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా డీఈవో రవీందర్‌రెడ్డి హాజరై ప్రకృతి మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశమని, ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ఉపన్యాస పోటీల విజేతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి మ్యాక చైత్ర(జెడ్పీహెచ్‌ఎస్‌, కడ్తాల్‌), ద్వితీ య బహుమతి ఆకుల వైష్ణవి(కేజీబీవీ లక్ష్మణచాంద), మూడో బహుమతి మగ్గిడి సుమిత్‌(జెడ్పీ హెచ్‌ఎస్‌, దిలావర్‌పూర్‌)లు ఎంపికయ్యా రు. మొదటి బహుమతి రూ.3 వేలు, ద్వితీయ బహుమతి రూ.2 వేలు, తృతీయ బహుమతి వెయ్యి రూపాయలు, మెమొంటోలు అందించారు. ఇందులో జిల్లా పరీక్ష ల సహాయ అధికారి పద్మ, సోషల్‌ ఫోరం అధ్యక్షుడు నకిరెడ్డి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మధు సిలారి, కోశాధికారి దూస ఆంజనేయులు, గౌరవ అధ్యక్షుడు గాజుల పోతన్న, ఉపాధ్యక్షురాలు హేమలత, కుర్ర శేఖర్‌, గరిగంటి రమేశ్‌, సోషల్‌ ఫోరం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement