స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు! | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు!

Published Sun, Nov 19 2023 1:26 AM

సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు - Sakshi

● రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు అజయ్‌నాయక్‌, దీపక్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటిస్తూ, పూర్తి అవగాహనతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికల విధులను నిర్వర్తించాలని, ఎన్నికలు శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో జరిగేలా సహకరించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు అజయ్‌నాయక్‌ (రిటైర్డ్‌ ఐఏఎస్‌), దీపక్‌ (రిటైర్డ్‌ ఐపీఎస్‌)అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను గుర్తించాలని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

విధులపై అవగాహన ఉండాలి...

రిటర్నింగ్‌ అధికారులకు ఎన్నికల నిర్వహణలో భాగంగా నిర్వహించే విధులు, కార్యకలాపాలపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఈవీ ఎంల నిర్వహణపై, బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌ తది తర అంశాలపై అవగాహన ఉండాలన్నారు. బ్యాలె ట్‌ పత్రాల ముద్రణలో తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దని సూచించారు. రిటర్నింగ్‌ అధికారి పరిధి లోని అన్ని టీంలకు వారికి కేటాయించిన విధులపై అవగాహన కల్పించాలని రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్‌ ముగిసిన తరువాత రిసెప్షన్‌ సెంటర్లకు జాగ్రత్తగా తీసుకువెళ్లే విధంగా పో లింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపారు. సిబ్బందికి వాహనాలు ఏర్పాటు చేసి, పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. పీడబ్ల్యూడీ, సీనియర్‌ సిటిజన్స్‌కు ఫామ్‌– 12డి ఇవ్వాలన్నారు. ప్రతీ ఓటర్‌కు ఓటర్‌ సమాచార స్లిప్పులను వంద శాతం పంపిణీ చేయాలని తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియకు అవసరమైన అన్ని పనులు ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ కాంతిలాల్‌పాటిల్‌, డీఎస్పీ గంగారెడ్డి, అదనపు కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌, రిటర్నింగ్‌ అధికారులు, పోలీస్‌ అధికారులు, రవా ణాశాఖ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement