ఇబ్బందులపై సిబ్బంది చర్చ! | Sakshi
Sakshi News home page

ఇబ్బందులపై సిబ్బంది చర్చ!

Published Wed, Nov 22 2023 12:14 AM

- - Sakshi

నిర్మల్‌ ఖిల్లా:శాసనసభ ఎన్నికలకు మరో వారం గడువుంది. ఈనెల 30న పోలింగ్‌ జరుగనుంది. జి ల్లాలో ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నిక ల విధులను కేటాయించారు. తొలి విడత శిక్షణ ఇ ప్పటికే పూర్తికాగా, ప్రస్తుతం రెండో విడత శిక్షణ కొ నసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ స జావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ఏర్పా ట్లు చేస్తోంది. అయితే పోలింగ్‌ విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఒకరోజు ముందుగా అనగా 29న ఉదయాన్నే నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వద్ద కేటాయించిన పో లింగ్‌ కేంద్రానికి సామగ్రిని తీసుకుని చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే రాత్రివేళ బసచేయాలి. నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గకేంద్రాలుండగా వీటిలో ఖానాపూర్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ కేంద్రంగా ఉట్నూర్‌ ఉండడంతో నిర్మల్‌ జిల్లాకు చెంది న సిబ్బందికి దూరభారం కానుంది. అక్కడ వసతి సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అని తెలుసుకుంటున్నారు. గతానుభవాల దృష్ట్యా అసౌకర్యాలు తలెత్తకుండా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

పోలింగ్‌ విధులు ఇలా...

పోలింగ్‌ విధుల్లో ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయులను నియమించారు. వీరిలో ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రంలో పీవో, ఇద్దరు ఏపీవోలు, ఇద్దరు ఓపీఓలు అంటే మొత్తం నలుగురు ఉంటారు. 20% రిజర్వు సిబ్బందిని కలుపుకుని ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఎన్నికల విధులకు ఉద్యోగులను కేటాయించారు. కలెక్టరేట్‌లో నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌లో నిర్దేశిత సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడి సమక్షంలో విధులను కేటాయిస్తారు. కేటాయించిన ఎన్నికల సిబ్బంది ఈ నెల 29న ఉదయం ఆయా నియోజకవర్గకేంద్రాల్లో రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో ఈవీఎంలు తదితర ఎన్నికల సామగ్రిని అప్పగించి విధులకు పంపిస్తారు. 30న ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది పోలింగ్‌ పూర్తయిన అనంతరం సాయంత్రం తిరిగి అదే కేంద్రంలో అప్పగించిన తర్వాత వారి స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది.

గైర్హాజరు కుదరదిక..

శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సిబ్బంది పాత్ర క్రియాశీలకం కావడంతో ఇందుకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా క్రమశిక్షణాయుతంగా విధుల్లో ఉండాల్సిందేనని ఎన్నికల అధికారులు పే ర్కొంటున్నారు. పోలింగ్‌ విధుల్లో ఎదురయ్యే అసౌకర్యాల కారణంగా కొందరు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని భావిస్తున్నప్పటికీ శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది తప్పనిసరిగా ఎన్నికలకు విధులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అన్నిరకాల వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని అంటున్నారు. పీఓలు, ఏపీవోలు, ఓపీవోలకు రెండో విడత శిక్షణ కూడా సోమవారం ఆయా నియోజకవ ర్గ కేంద్రాల్లో ప్రారంభమైంది. విధుల నుంచి మినహాయింపు పొందాలంటే వికలాంగులు లేదా తీవ్ర అనారోగ్య సమస్యల కారణాలతో ధ్రువీకరించుకుని జిల్లా ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.నిబంధనలు కఠినతరంగా ఉండడంతో అలాంటి ప్రయత్నాలు చేయకుండా విధులకు హాజరవ్వడమే ఉత్తమమని భావిస్తున్నారు.

30న రాత్రి తిరుగు ప్రయాణం...

పోలింగ్‌ ముగిసే సమయం సాయంత్రం ఐదు గంటలకే అయినా ఆ సమయానికి పోలింగ్‌ కేంద్రం లోపల ఓటర్లు ఉంటే వారిని ఓటేసేందుకు అనుమతిస్తారు. ఈ రకంగా అక్కడే దాదాపు సాయంత్రం 7 గంటలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈవీఎంలను ఎన్నికల సామగ్రిని జాగ్రత్తగా సర్దుకుని రిటర్నింగ్‌ అధికారి వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా నిర్మల్‌ జిల్లాలో మూడు నియోజకవర్గ కేంద్రాలు ఉండగా నిర్మల్‌, ముధోల్‌ ప్రాంతాల్లో ఇబ్బంది లేనప్పటికీ ఖానాపూర్‌ నియోజకవర్గ కేంద్రం ఉట్నూరులో ఉండడం మూలంగా కేటాయించబడిన సిబ్బంది ఖానాపూర్‌ పరిసర ప్రాంతాల్లో విధులు ముగించుకొని మళ్లీ దూరంగా ఉన్న ఉట్నూర్‌ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎన్నికల సామగ్రి అప్పగించి స్వస్థలాలకు వెళ్లాలి. ఇదంతా పూర్తయ్యే సరికి దాదాపు రాత్రి 10 గంటల సమయం పట్టేఅవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. 29వ తేదీ ఉదయం నుంచి 30వ తేదీ రాత్రి వరకు వీరికి అన్ని రకాల వసతి సౌకర్యాలు భోజన సౌకర్యాలు కల్పించేందుకు ఇన్‌చార్జీలు, సెక్టోరియల్‌ అధికారులు ఉంటారని చెబుతున్నారు గత ఎన్నికల సందర్భంలో తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని సిబ్బంది పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement