పోలింగ్‌ కేంద్రాలపై నిఘా ఉంచాలి | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలపై నిఘా ఉంచాలి

Published Wed, Nov 22 2023 12:14 AM

సమావేశంలో పాల్గొన్న ఎన్నికల పరిశీలకులు రవిరంజన్‌, లక్ష్మణ్‌ ,ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌
 - Sakshi

● పోలీస్‌ పరిశీలకులు లక్ష్మణ్‌ నింబర్గి

నిర్మల్‌టౌన్‌: శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా గట్టి చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా ఉంచాలని పోలీస్‌ పరిశీలకులు లక్ష్మణ్‌ నింబర్గి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. సాధారణ పరిశీలకులు రవి రంజన్‌కుమార్‌విక్రమ్‌, పోలీస్‌ పరిశీలకులు లక్ష్మణ్‌ నింబర్గి ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై కలెక్టరేట్‌ మినీ సమావేశమందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ముందుగా పోలీస్‌ బందోబస్తు ప్రక్రియను ప్రజెంటేషన్‌ ద్వారా ఎస్పీ వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 922 పోలింగ్‌ కేంద్రాలకు, నిర్మల్‌కు సంబంధించినవి 306, ముధోల్‌ 311, ఖానాపూర్‌ నియోజకవర్గానికి 305 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సమన్వయంతో పనిచేయాలి..

ఈ సందర్భంగా పోలీస్‌ పరిశీలకులు లక్ష్మణ్‌ నింబర్గి మాట్లాడుతూ... ఎన్నికల నిర్వహణలో పోలీస్‌, రెవెన్యూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, ఎన్నికల కమిషన్‌ నియమావళి ప్రకారం పనిచేయాలని సూచించారు. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను వెంటనే గుర్తించాలన్నారు. పోలింగ్‌ శాతం పెరిగేలా ఓటరు నిర్భయంగా వచ్చి తన ఓటు వేసేలా చూడాలని తెలిపారు. ప్రతీ పోలింగ్‌ బూత్‌ దగ్గర ప్రతిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్‌ బూత్‌కు 100 మీటర్ల దూరంలో వాహనాలు నిలిపేలా పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement