ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన | Sakshi
Sakshi News home page

ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన

Published Wed, Jan 31 2024 11:36 PM

ప్రాజెక్ట్‌పై ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం, అధికారులు - Sakshi

కడెం: ఎన్డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ (విజయవాడ) బృందం బుధవారం మండలంలో పర్యటించింది. ప్రకృతి వైపరీత్యాల బారి నుంచి ప్రాణాలు కాపాడుకునేలా బృందం సభ్యులు మండలంలోని పాండ్వపూర్‌ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. వరదలు వచ్చినపుడు, అగ్ని ప్రమాదాలు జరిగినపుడు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. గుండెపోటు బారి నుంచి ప్రాణాలు రక్షించుకునేలా సీపీఆర్‌ ఎలా చేయాలో వివరించారు. అంతకుముందు కడెం ప్రాజెక్ట్‌ను సందర్శించి గతేడాది వచ్చిన వరదల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ టీం కమాండర్‌ ఇన్‌స్పెక్టర్‌ పింటు నంది, సభ్యులు రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, తహసీల్దార్‌ సుజాత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

Advertisement
Advertisement