యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!

2 Apr, 2024 17:21 IST|Sakshi

భారతదేశంలోనే పుట్టి, పెరిగిన ఒక మహిళ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆహర్నిశలు కష్టపడి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చింది. యూఎస్‌లోనే అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా ‍వ్యాపారవేత్తగా నిలవడమే గాక ఫోర్బ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఎవరీమె అంటే..

భారత్‌కి చెందిన నేహా నార్ఖేడే పుట్టింది, పెరిగింది పూణేలోనే. ఆ తర్వాత యూఎస్‌లోని జార్జియా టెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అక్కడే లింక్డ్‌ఇన్‌, ఒరాకిల్‌ వంటి కంపెనీల్లో పనిచేసి కాన్‌ఫ్లూయెంట్‌ అనే కంపెనీని స్థాపించింది. ప్రారంభంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అనతి కాలంలోనే రూ. 75 వేల కోట్ల టర్నోవర్‌తో దూసుకువెళ్లడం ప్రారంభించింది. అలా నేహా అత్యంత పిన్న వయస్కురాలైన పారిశ్రామిక వేత్తగా, అమెరికాలో ఎనిమిదొవ అత్యంత సంపన్న మహిళగా అవతరించింది.

చిన్నతనంలో తాను ఇందిరా గాంధీ, కిరణ్‌బేడి, ఇంద్రానూయి వంటి ప్రముఖులు గురించి చదవడం వల్ల విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించగలిగానని చెబుతోంది. ఆమె కంపెనీ పబ్లిక్‌గా మారిన తర్వాత 2021 నాటికల్లా రూ. 13 వేల కోట్లకు చేరుకుంది. అనూహ్యంగా ఆమె సంపద 2022లో దారుణంగా పడిపోయి దాదాపు రూ. 8 వేల కోట్ల నష్టాన్ని నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ మళ్లీ కంపెనీని లాభాల బాటపట్టించింది. ప్రస్తుతం నేహా కంపెనీ నికర విలువ ఏకంగా రూ. 75 వేల కోట్లు. అంతేగాదు మార్చి 2023లో నార్ఖేడ్‌ మోసాలను గుర్తించే సంస్థ ఓస్కిలార్‌ అనే కొత్త కంపెనీను కూడా స్థాపించింది. అంతేగాదు ఫోర్బ్స్‌ మ్యాగ్జైన్‌లో  స్వీయ సంపన్న మహిళల జాబితాలో నేహా చోటు దక్కించుకోవడం విశేషం. 

(చదవండి: మహిళా ఎన్‌ఆర్‌ఐ ‘చెత్త’ బిజినెస్‌.. రూ.1000 కోట్లు టార్గెట్‌)

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers