-
సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వీటిని సది్వనియోగం చేసుకుంటూ మహిళలు సొంతంగా ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసి, మరికొందరికి ఉపాధి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో అంటే.. 2022 జూలై నుంచి 2024 జనవరి వరకు రాష్ట్రంలో మహిళలు సొంతంగా 2,17,359 ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖే వెల్లడించింది. ఈ మహిళా ఎంఎస్ఎంఈల ద్వారా 1,8,03,672 మంది యువతకు ఉద్యోగాలు లభించాయని తెలిపింది. ఈ మహిళా ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు రూ.7,229.41 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, వీటి టర్నోవర్ రూ.73,435.96 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఇవన్నీ అధికారికంగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వద్ద నమోదైన ఎంఎస్ఎంఈలు కాగా, ఇప్పటికీ నమోదు కాని ఎంఎస్ఎంఈలు రాష్రంలో 2023 జనవరి 11 నుంచి 2024 జనవరి 31 వరకు ఒక్క ఏడాదిలోనే మరో 4,73,932 మహిళా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేశారని, వీటి ద్వారా 6,,22,389 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని పేర్కొంది. మహిళా యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఎంఎస్ఎంఈలకు ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పోగ్రామ్ (పీఎంఈజీపీ) కింద క్రెడిట్ గ్యారెంటీ నిధి నుంచి ఆరి్ధక సాయం అందిస్తున్నట్లు తెలిపింది. మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి నైపుణ్యాలను అమలు చేస్తోందని పేర్కొంది. ప్రత్యేకంగా మహిళల ఎంఎస్ఎంఈలను ఉద్యమం పోర్టలో రిజి్రస్టేషన్‌కు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, వారికి అవరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొంది.పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ చేయూత రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను పలు విధాలుగా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలు స్థాపించే ఎంఎస్ఎంఈలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకుండా పెద్ద ఎత్తున బకాయిలు పెట్టింది. దీంతో ఎంఎస్ఎంఈలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించడంతో పాటు ఎంఎస్ఎంఈలకు రూ.2,087 కోట్లు రాయితీలుగా చెల్లించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. దీంతో ఆ పరిశ్రమలన్నీ కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకొని, నిలదొక్కుకోవడమే కాకుండా, రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. -
యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!
భారతదేశంలోనే పుట్టి, పెరిగిన ఒక మహిళ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆహర్నిశలు కష్టపడి కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చింది. యూఎస్‌లోనే అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా వ్యాపారవేత్తగా నిలవడమే గాక ఫోర్బ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఎవరీమె అంటే.. భారత్‌కి చెందిన నేహా నార్ఖేడే పుట్టింది, పెరిగింది పూణేలోనే. ఆ తర్వాత యూఎస్‌లోని జార్జియా టెక్‌లో కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అక్కడే లింక్డ్ఇన్, ఒరాకిల్ వంటి కంపెనీల్లో పనిచేసి కాన్ఫ్లూయెంట్ అనే కంపెనీని స్థాపించింది. ప్రారంభంలో గణనీయమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అనతి కాలంలోనే రూ. 75 వేల కోట్ల టర్నోవర్‌తో దూసుకువెళ్లడం ప్రారంభించింది. అలా నేహా అత్యంత పిన్న వయస్కురాలైన పారిశ్రామిక వేత్తగా, అమెరికాలో ఎనిమిదొవ అత్యంత సంపన్న మహిళగా అవతరించింది. చిన్నతనంలో తాను ఇందిరా గాంధీ, కిరణ్‌బేడి, ఇంద్రానూయి వంటి ప్రముఖులు గురించి చదవడం వల్ల విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణించగలిగానని చెబుతోంది. ఆమె కంపెనీ పబ్లిక్‌గా మారిన తర్వాత 2021 నాటికల్లా రూ. 13 వేల కోట్లకు చేరుకుంది. అనూహ్యంగా ఆమె సంపద 2022లో దారుణంగా పడిపోయి దాదాపు రూ. 8 వేల కోట్ల నష్టాన్ని నష్టాలను చవిచూసింది. అయినప్పటికీ మళ్లీ కంపెనీని లాభాల బాటపట్టించింది. ప్రస్తుతం నేహా కంపెనీ నికర విలువ ఏకంగా రూ. 75 వేల కోట్లు. అంతేగాదు మార్చి 2023లో నార్ఖేడ్ మోసాలను గుర్తించే సంస్థ ఓస్కిలార్ అనే కొత్త కంపెనీను కూడా స్థాపించింది. అంతేగాదు ఫోర్బ్స్ మ్యాగ్జైన్లో స్వీయ సంపన్న మహిళల జాబితాలో నేహా చోటు దక్కించుకోవడం విశేషం. (చదవండి: మహిళా ఎన్ఆర్ఐ ‘చెత్త’ బిజినెస్.. రూ.1000 కోట్లు టార్గెట్) -
Rajasthan Election 2023: మోదీ నినాదం.. అదానీజీ కీ జై
బుందీ/దౌసా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బడా పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదానీ సేవలో తరిస్తున్నారని, ఆయన కోసమే పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్ మాతా జై’ అని చెప్పే మోదీ అదానీ కోసం నిత్యం 24 గంటలూ పరితపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘భారత్ మాతాకీ జై’ అనడానికి బదులు ‘అదానీజీ కీ జై’ అని నినదించాలని మోదీకి హితవు పలికారు. భరతమాత అంటే పేదలు, రైతులు, కారి్మకులేనని స్పష్టం చేశారు. ఆదివారం రాజస్తాన్‌లోని బుందీ, దౌసా జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రాహుల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ రెండు హిందూస్తాన్‌లను సృష్టించాలని భావిస్తున్నారని, అందులో ఒకటి అదానీ కోసం, మరొకటి పేదల కోసం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కుల గణన ఎందుకు నిర్వహించడం లేదని మోదీని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దేశమంతటా కుల గణన ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాజస్తాన్‌లోనూ అధికారంలోకి రాగానే కులగణనకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కులగణనతోనే భరతమాత విజయం సాధిస్తుందని వివరించారు. రోజుకు మూడుసార్లు దుస్తులు మారుస్తారు మనదేశంలో బడా పారిశ్రామికవేత్తల్లో ఎవరైనా ఓబీసీలు, దళితులు, గిరిజనులు ఉన్నారా అని రాహుల్ ప్రశ్నించారు. రాజస్తాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు. మోదీ రూ.12,000 కోట్లతో విమానం కొనుక్కున్నారని, రోజుకు మూడు సార్లు దుస్తులు మారుస్తారని, రూ.12 కోట్ల విలువైన కారులో ప్రయాణిస్తుంటారని మోదీపై ధ్వజమెత్తారు. తమ జనాభా ఎంత ఉందో చెప్పాలని ఓబీసీ, దళిత, గిరిజన యువత అడిగితే మాత్రం కులాలు లేవని ప్రధానమంత్రి అంటున్నారని దుయ్యబట్టారు. మోదీ 90 మంది ఐఏఎస్ అధికారులతో పరిపాలన నడిపిస్తున్నారని, వారిలో ఓబీసీలు ముగ్గురే ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఓబీసీల జనాభా 50 శాతం ఉందని, ఐఏఎస్‌లు మాత్రం జనాభాకు తగ్గట్టుగా లేరని తెలిపారు. -
ఆప్తమిత్రులకు గోల్డెన్ పాస్‌పోర్టా?: రాహుల్
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అన్న వినోద్ అదానీ సహా 66 భారతీయులు సైప్రస్ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ పాస్‌పోర్ట్’ మంజూరు చేసినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘అమృత్‌కాల్‌లో ఆప్తమిత్రులైన ఆ సోదరులిద్దరూ దేశం విడిచి ఎందుకు వెళ్లారు? గోల్డెన్ పాస్‌పోర్టు అంటే ప్రజాధనాన్ని దోచుకుని, డొల్ల కంపెనీలు పెట్టుకుని, విదేశాల్లో జల్సా చేసేందుకు బంగారంలాంటి అవకాశం’అని బుధవారం రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రాహుల్ ఆరోపణలపై బీజేపీ దీటుగా స్పందించింది. సైప్రస్ ఇన్వెస్టిమెంట్ ప్రోగ్రామ్ లేదా గోల్డెన్ పాస్‌పోర్ట్ పథకాన్ని 2007లో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేసింది. పన్ను ఎగవేతదారులకు లాభించేలా సైప్రస్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక, ఈ విధానంపై నియంత్రణలు తీసుకువచ్చామని పేర్కొంది. -
పారిశ్రామిక పార్కుల్లో 16.2 శాతం భూమి ఎస్సీలకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేసే పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ పారిశ్రామికవేత్తలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూమి తప్పనిసరిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన పారిశ్రామిక పాలసీ 2023 –27 కింద వివిధ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులకు ఏపీఐఐసీ భూ కేటాయింపులకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీఐఐసీ ఇండ్రస్టియల్ పార్క్స్ అలాట్మెంట్ రెగ్యులేషన్ 2020 కింద కేటాయించిన భూములకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని, తాజాగా చేసిన కేటాయింపులకు మాత్రమే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.తాజా మార్గదర్శకాల ప్రకారం.. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం భూమిని కామన్ ఫెసిలిటీ సెంటర్, 5 శాతం వాణిజ్య ప్లాట్స్‌కు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 15 శాతం కేటాయించాలి. రూ.500 కోట్ల పైబడి పెట్టుబడితో కనీసం 1,000 మందికి ఉపాధి కల్పిస్తూ కనీసం మరో ఐదు అనుబంధ యూనిట్లు వచ్చే యాంకర్ యూనిట్లకు 25 శాతం తక్కువ ధరకు భూమి కేటాయిస్తారు. మండలస్థాయిలో ఏర్పాటు చేసే యాంకర్ యూనిట్లకు 20 నుంచి 33 శాతం వరకు తగ్గింపు ఇస్తారు. 33 ఏళ్లపాటు లీజుకు భూమిని ఇస్తారు. ఆ తర్వాత లీజును 66, 99 సంవత్సరాలకు పెంచుకోవచ్చు. ఉత్పత్తి ప్రారంభించి 10 ఏళ్లు దాటి నిబంధనలను పూర్తి చేసిన యూనిట్లకు ఆ భూమిని కొనుక్కొనే హక్కు కల్పిస్తారు. వివిధ కంపెనీలకు భూకేటాయింపులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహక విధానంలో భాగంగా వివిధ పరిశ్రమలకు భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వట్ల గ్రామం వద్ద ఉన్న రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని సంజమల రైల్వే స్టేషన్‌కు అనుసంధానిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం 211.49 ఎకరాలు కేటాయించింది. ఎన్టీఆర్ జిల్లా మల్లవల్లి వద్ద బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు అవిశా ఫుడ్స్‌కు 101.81 ఎకరాలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద సత్య బయోఫ్యూయల్‌కు 30 ఎకరాలు కేటాయించింది. తిరపతిలో హిందుస్థాన్ స్టీల్ వర్క్స్‌కు కేటాయించిన 50.71 ఎకరాల యూనిట్ పూర్తి కావడానికి గడువును పెంచింది. కియా వెండర్స్‌కు రాయితీలకు సంబంధించిన విధివిధానాలు, శ్రీకాళహస్తి వద్ద ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (గతంలో శ్రీకాళహస్తి పైప్స్) కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫెర్రో అల్లాయిస్ యూనిట్‌కు, గుంటూరు టెక్స్టైల్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్కులకు వాటి పెట్టుబడి, ఉద్యోగ కల్పన ఆధారంగా టైలర్‌మేడ్ రాయితీలను ప్రకటించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement