తగ్గిన జీడి.. పెరిగిన కోడి | Sakshi
Sakshi News home page

తగ్గిన జీడి.. పెరిగిన కోడి

Published Mon, Jun 5 2023 7:46 AM

- - Sakshi

కాశీబుగ్గ/శ్రీకాకుళం: మార్కెట్‌లో జీడిపప్పు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు చికెన్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జాతీయ మార్కెట్‌లో సంక్షోభంతో జీడిపప్పు అమ్మకాలు వారం రోజులుగా గణనీయంగా పడిపోవడంతో పరిశ్రమదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలాస, ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో సుమారు 400 జీడి పరిశ్రమలు ఉనఆనియ.

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో జీడిపప్పు వాడకం తగ్గడంతో పాటు, మండుతున్న ఎండలు ధరల పతనానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి రకం జీడి(గుడ్డు) ధర వారం రోజుల వ్యవధిలో కిలోపై రూ.150 వరకు తగ్గింది. వివిధ రకాల జీడిపప్పు, బద్ద, గుండ సుమారు రూ.75 వరకు తగ్గింది. ధరల తగ్గుముఖంపై పీసీఎంఏ అధ్యక్షుడు మల్లా సురేష్‌కుమార్‌, పలాస ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ అధ్యక్షుడు మల్లా రామేశ్వరం మాట్లాడుతూ ఏటా పెరిగే సమయంలో ఈసారి ధరలు తగ్గిపోయాయని చెప్పారు.

కొండెక్కిన కోడి
మాంసాహర ధరలు మాత్రలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 20 రోజుల క్రితం ధరలతో పోల్చితే చికెన్‌ ధర రూ.80, గుడ్డు ధర రూపాయి, చేపలు ధర రకాలను పట్టి రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగాయి. వేసవి కాలంలో ఇలా ధరలు పెరగటం సాధారణమే అయినా ఈ ఏడాది పెరుగుదల విపరీతంగా ఉంది. వేసవిలో వ్యాధులు సోకుతాయన్న కారణంగా పౌల్ట్రీ యజమానులు సీజన్‌లో తక్కువగా కోళ్లను పెంచుతారు.

ఫలితంగా ధర పెరుగుతోంది. అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో కిలో నుంచి కిలోన్నర కోళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వాస్తవంగా పౌల్ట్రీ యజమానులు కోడి బరువు రెండు కిలోలు దాటిన తరువాత మాత్రమే విక్రయిస్తుంటారు. ఇప్పుడు కోళ్లకు డిమాండ్‌ పెరగటంతో కిలో కోళ్లనే విక్రయిస్తున్నారు. వీటి రుచి కూడా తగ్గుతోందని మాంసాహార ప్రియులు చెపుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement