దాడి కేసులో నిందితుడు అరెస్టు | Sakshi
Sakshi News home page

దాడి కేసులో నిందితుడు అరెస్టు

Published Sun, Nov 19 2023 12:50 AM

నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు  - Sakshi

రాయగడ: జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం దేవగిరిలోని క్రాంతికారి ఆశ్రమానికి చెందిన స్వామీ స్వరూపానంద గిరిపై దాడి కేసులో నిందితుడిని కల్యాణ సింగుపూర్‌ పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన రవి బాగ్‌ (31)గా గుర్తించారు. ఈనెల 14వ తేదీన స్వామీ స్వరూపానందగిరి తమ ఆశ్రమంలోని గోశాలకు అవసరమయ్యే సూచిక బోర్డును తయారు చేయించేందుకు కల్యాణ సింగుపూర్‌లోని వెల్డింగ్‌ గ్యారేజీకి వెళ్తున్న సందర్భంలో, అక్కడే ఒక ఆకతాయి ఇనుప రాడ్డుతో దాడి చేసిన సంగతి పాఠకులకు విధితమే. ఈ క్రమంలో తీవ్రగాయాలకు గురైన స్వామిని మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. క్రాంతికారి ఆశ్రమానికి చెందినవారు, స్థానికులు స్వామిపై జరిగిన దాడిని నిరసిస్తూ నిందితుడిని అరెస్టు చేయాలని శుక్రవారం కల్యాణ సింగుపూర్‌లో పోలీసులకు వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకొని కోర్టుకు తరలించారు. కాగా తలపై తీవ్రంగా రెండు చోట్ల గాయాలు అవ్వడంతో స్వామికి ఎంఆర్‌ఐ స్కానింగ్‌ నిర్వహించడం జరిగిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచైతన్య రాంజీ శనివారం నిర్వహించిన పత్రిక సమావేశంలో తెలియజేశారు. రోజులు గడిచినా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఉన్నత చికిత్స కోసం భువనేశ్వర్‌ తరలించనున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా ఆధ్యాత్మిక వాతావరణంలో గల ఆశ్రమాల్లో ఇటువంటి దాడికి పాల్పడడం విచారకరమన్నారు.

మాట్లాడుతున్న 
శ్రీచైతన్య రాంజీ
1/1

మాట్లాడుతున్న శ్రీచైతన్య రాంజీ

Advertisement
Advertisement