కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

Published Fri, Nov 10 2023 4:56 AM

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న శ్యాంప్రసాద్‌లాల్‌
 - Sakshi

● అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌

జూలపల్లి(పెద్దపల్లి): రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో కరీంనగర్‌ జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా ఫౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి, శుద్ధి చేసి కేంద్రానికి తీసుకురావాలని పేర్కొన్నారు. కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని, ఇబ్బందులు రాకుండా కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా మండలంలో వరి సాగయ్యే విస్తీర్ణం, సాగునీటి సదుపాయాలు, దిగుబడి తదితర వివరాలను మండల వ్యవసాయాధికారి ప్రత్యూషను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, పీఏసీఎస్‌ సీఈవో సురేశ్‌, ఏఈవో శ్రీవాణి, మార్కెటింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement