బలపరీక్ష నెగ్గిన నితీష్‌ సర్కార్‌

12 Feb, 2024 15:53 IST|Sakshi

బిహార్‌ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన నితీష్‌ సర్కార్‌

  •  సీఎం నితీష్‌కుమార్‌కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు
  • బిహార్‌లో మొత్తం 243 స్థానాలు, మ్యాజిక్‌ ఫిగర్‌ 122
  • శాసన సభ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్‌

బిహార్‌ అసెంబ్లీలో బలపరీక్ష 

  • అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం నితీష్‌ కుమార్‌ 
  • నితీష్‌ కుమార్‌పై తేజస్వీ యాదవ్‌ ఘాటు విమర్శలు
  • బీహార్‌లో ఏ ఒక్కరికీ నితీష్‌ కుమార్‌పై నమ్మకం లేదు
  • నీతీష్‌ మళ్లీ జంప్‌ చేయరని మోదీ గ్యారంటీ ఇవ్వగలరా? 

బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌పై నెగ్గిన అవిశ్వాసం

  • అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు
  • ప్రస్తుత బిహార్‌ స్పీకర్‌గా ఆర్జేడీ నేత బిహారీ చౌదరి 
  • నితీష్‌కు అనుకూలంగా ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు 

బిహార్‌ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం జరగనుంది. కొత్తగా కొలువుదీరిన జేడీయూ అధినేత, సీఎం నితీష్‌ కుమార్‌- బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనుంది. ఈ బల పరీక్షలో ఎన్డీయే సర్కార్‌ సులువుగా నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధాన విపక్షమైన ఆర్జేడీ తన బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 

బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాసం నెగ్గింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 113 ఓట్లు వచ్చాయి. అయితే నితీష్‌కు అనుకూలంగా ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఓటేయ్యడం గమనార్హం. ప్రస్తుతం బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా ఆర్జేడీ నేత బిహారీ చౌదరి ఉన్నారు.

అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. సీఎం నితీష్‌ కుమార్‌, డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌ చౌదరి, విజయ్‌ కుమార్‌ సిన్హా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.

బిహార్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తర్వాత గవర్నర్‌ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిని(ఆర్జేడీ నేత) తొలగించాలంటూ ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన వెంటనే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత బల పరీక్ష జరగనుంది.

243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం బీజేపీ-జేడీయూ కూటమికీ 128 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 78, నితీష్‌ కుమార్‌ పార్టీ జేడీయూకి 45, జితిన్‌ రామ్‌ మంఝీకి చెందిన ఆవామ్‌ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు, ఒకరు స్వతంత్ర్య ఎమ్మెల్యే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష కూటమికి 114 ఎమ్మెల్యేల బలం ఉంది. ఆర్జేడీ-79, కాంగ్రెస్‌-19, సీపీఐ(ఎంఎల్‌)-12, సీపీఎం-2, సీపీఐ-2, ఇతరులు-1, ఏఐఎంఐఎం-1..కూటమికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతుంది.
చదవండిBihar Assembly Floor Test: నేడు బీహార్‌లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత?

కాగా జనవరి 28న రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు కూటములు తమ ఎమ్మెల్యేలు గీత దాటకుండా క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. ప్రతిపక్ష 'మహాఘట్‌బంధన్‌'కు చెందిన 79 మంది శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ నివాసంలో మకాం వేశారు. ఇటు కాంగ్రెస్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు బిహార్‌కు బయలుదేరారు. మరోవైపు ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్‌ను హౌస్ అరెస్టు చేశారని ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఆయన ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega