పొత్తులపై స్పందించిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య | Sakshi
Sakshi News home page

పొత్తులపై స్పందించిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య

Published Sat, Jan 27 2024 2:59 PM

Chegondi Harirama Jogaiah Letter On Tdp And Janasena Alliance - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య లేఖ రాశారు. మండపేట, అరకుకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం సరికాదన్నారు. రాజోలు, రాజానగరం సీట్లను పవన్‌ కల్యాణ్‌ ప్రకటించినప్పటికీ జనసేన కార్యకర్తలు సంతృప్తిగా లేరన్నారు.

‘‘జనసేనకు 50 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు కేటాయించాలి. 20-30 సీట్లు ఇస్తే పవన్ ఆశయాలకు భంగం కలుగుతుంది. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోంది. 2019లో ఓడిపోయిన జనసేన నేతలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే నిరాశపరిచినట్టేనని మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.

కాగా, యాచించే స్థితిని పవన్‌ నుంచి జన సైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ గతంలో కూడా లేఖ ద్వారా చురకలంటించారాయన.

Advertisement

తప్పక చదవండి

Advertisement