పదో రోజు ‘మేమంతా సిద్ధం’: దారి పొడవునా జననేతకు నీరా‘జనం’ | Sakshi
Sakshi News home page

పదో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అప్‌డేట్స్‌..

Published Sun, Apr 7 2024 7:56 AM

cm ys jagan memantha siddham bus yatra day 10 updates highlights - Sakshi

Memantha Sidham Day 10 Highlights CM Jagan Bus Yatra Details

సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన దర్శి ప్రజలు

  • దర్శిలో పండుగ వాతావరణం
  • దర్శిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం
  • సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన దర్శి ప్రజలు

దర్శిలో పండగ వాతావరణం

  • కాసేపట్లో దర్శి చేరుకోనున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • దర్శిలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు భారీ స్వాగత ఏర్పాట్లు
  • సిటీ మొత్తం మైక్ సెట్లు ఏర్పాట్లు చేసిన కార్యకర్తలు
  • గజ మాలలు, తోరణాలు, మేళ తాళాలతో భారీ స్వాగతం పలకనున్న దర్శి ప్రజలు
  • సీఎం జగన్ రాక కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న ప్రజలు
  • గడియారం సెంటర్‌కి భారీగా చేరుకున్న ప్రజలు..

‘కొనకొనమిట్ల’ సభలో సీఎం జగన్‌ ప్రసంగం.. ముఖ్యాంశాలు

  • జన సముద్రం కనిపిస్తోంది
  • ఇసుక వేసినా రాలనంతా జనం కనిపిస్తున్నారు
  • చేయి చేయి కలిపిన ప్రజా కెరటంలా మేమంతా సిద్ధం అని వినిపిస్తోంది 
  • పేదల వ్యతిరేకులను ఓడించి సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా
  • ఈ ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నికలు కావు 
  • పిల్లల బడులు, అక్క,చెల్లెల సాధికారత, అవ్వా,తాతల సంక్షేమం,రైతు భరోసా కొనసాగాలా మోసపోయి వెనక్కు వెళ్లాలా అని నిర్ణయించే ఎన్నికలు
  • పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి
  • ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్‌ నిర్ణయిస్తాయి 
  • మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే 
  • జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు..బాబుకు వేస్తే ముగింపు 
  • చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే
  • చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు
  • చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించాడు 
  • అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి పెన్షన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడు
  • వాలంటీర్లతో పెన్షన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించాడు
  • ఈ ఎన్నికలు పేదలు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు 
  • వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో నెల ఒకటో తారీఖున పెన్షన్లు తెచ్చిచ్చారు 
  • చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెన్షన్లుకు లంచాలు తీసుకున్నాయి
  • వెయ్యి రూపాలయ కోసం రోజుల తరబడి నిలుచున్నా పెన్షన్లు రాలేదు 
  • ఎక్కడా లంచాల్లేకుండా వాలంటీర్‌ వ్యవస్థతో మీ బిడ్డ పెన్షన్లు ఇప్పించాడు 
  • వాలంటీర్‌ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి 
  • అందుకే వాలంటీర్‌లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు
  • అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు 
  • పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు 
  • ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు
  • పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు
  • పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు 
  • వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు 
  • ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు
  • ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్‌ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు
  • పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు షాడిస్టు కాక ఇంకేంటి
  • వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్‌ గ్యాంగ్‌ మొత్తం శాడిస్టులే 
  • మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్‌ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు
  • 14 ఏళ్లు సీఎంగా చేసినా ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్‌ గుర్తుకు రాని చంద్రబాబు మనకు ప్రత్యర్థి  
  • ఇది మీ బిడ్డ 58 ఏళ్ల పాలన ప్రోగ్రెస్‌ రిపోర్టు 
  • గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్‌.. మీ బిడ్డ 
  • గ్రామగ్రామానా ఫ్యామిలీ డాక్టర్‌ అంటే మీ జగన్‌.. మీ బిడ్డ 
  • అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్‌ అంటే మీ జగన్‌.. మీ బిడ్డ 
  • ఇంటింటికి వాలంటీర్‌ సేవలంటే మీ జగన్‌..మీ బిడ్డ 
  • పగటి పూటే రైతన్నలకు ఉచిత కరెంటు, ఉచిత పంటబీమా అంటే మీ జగన్‌..మీబిడ్డ 
  • ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే మీ జగన్‌..మీ బిడ్డ 
  • అమూల్‌ను తీసుకువచ్చి పాడి రైతులకు ధరలు పెంచింది మీ జగన్‌.. మీ బిడ్డ
  • వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది మీ జగన్‌..మీ బిడ్డ 
  • ఏకంగా 30 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది మీ జగన్‌..మీ బిడ్డ 
  • నాడు..నేడుతో ప్రభుత్వ బడులు రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్‌..మీ బిడ్డ 
  • అమ్మఒడి ఇచ్చింది మీ జగన్‌.. మీ బిడ్డ 
  • పెద్ద చదువుల కోసం విద్యాదీవెన, విద్యావసతి ఇచ్చింది మీ జగన్‌..మీ బిడ్డ 
  • ప్రభుత్వ ఆస్పత్రులు రూపు మారాయంటే కారణం మీ జగన్‌.. మీ బిడ్డ
  • అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అంటే మీ జగన్‌ 
  • అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కారణం మీ జగన్‌ 
  • అక్క చెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్‌ అంటే మీ జగన్‌ 
  • వాహన మిత్ర అంటే మీ జగన్‌ 
  • లా నేస్తం అంటే మీ జగన్‌ 
  • అక్కచెల్లెమ్మలకు రాజకీయ సాధికరత దక్కించింది మీ జగన్‌ 
  • 58 నెలల కాలంలో 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ అక్కచెల్లెమ్మలకే దక్కాయి
  • నామినేటెడ్‌ పోస్టుల్లోనూ ఎస్సీ,ఎస్టీ,బీసీలకు న్యాయం చేశాం 
  • రాష్ట్రంలో 4 సీ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి 
  • ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగంగా జరగుతోంది 
  • కొత్త మెడికల్‌ కాలేజీలు శరవేగంగా నిర్మిస్తున్నాం 
  • మేనిఫెస్టోలో నూటికి 90 శాతం హామీలు నెరవేర్చాం 
  • స్కీములన్నీ గ్రామంలో కళ్లెదుటే కనిపిస్తున్నాయి 
  • ఈ కార్యక్రమాలన్నీ మీ బిడ్డ ఎలా చేశాడు..చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు
  • స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఐదు జెలుసిల్‌ ట్యాబ్లెట్లు వేసుకున్నా కడుపుమంట తగ్గట్లేదు 
  • ఇందుకే మన జెండా తలెత్తుకోని ఎగురుతూ ఉంది 
  • వాళ్ల జెండా 4 జెండాలతో జత కట్టినా కింద పడుతోంది 
  • 2014లో చంద్రబాబు ఇదే కూటమితో ముందుకువచ్చారు
  • మళ్లీ అదే చంద్రబాబు,పవన్‌కల్యాణ్‌, మోదీ వస్తున్నారు
  • హామీల కరపత్రాలను చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు
  • రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు
  • 80 వేల కోట్ల రుణమాఫీ చేశాడా 
  • పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశాడా 
  • ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు..చేశాడా
  • ఇంటింటికి ఉద్యోగమిచ్చాడా..నిరుద్యోగ భృతి ఇచ్చాడా 
  • అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చాడా
  • పక్కా ఇళ్లు నిర్మించాడా 
  • ఏపీని సింగపూర్‌గా మార్చాడా  
  • ప్రతి నగరాన్ని హైటెక్‌సిటీ చేస్తానన్నాడు చేశాడా 
  • ఇప్పుడు మళ్లీ ఇంటింటికి బంగారం,ఇంటింటికి బెంజ్‌ కారంటూ వస్తున్నాడు
  • చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే
  • రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి మీరు సిద్ధమేనా 
  • సిద్ధమయితే సెల్‌ఫోన్‌లో టార్చ్‌ ఆన్‌ చేసి సిద్ధమే అని నినదించండి 
  • 175కు 175 ఎమ్మెల్యే..25కు25 ఎంపీ సీట్లు గెలిపించేందుకు సిద్ధమేనా
  • మన గుర్తు ఫ్యాను.. గుర్తుంచుకుని ఓటేయండి 

ఎమ్మెల్యే అన్నా రాంబాబు కామెంట్స్‌ 

  • సీఎం జగన్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు 
  • పేదలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్‌ 
  • దమ్మున్న నాయకుడు సీఎం జగన్‌ 

కొనకొనమిట్ల ‘మేమంతా సిద్ధం’ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌ 

  • ప్రకాశం జిల్లా, కొనకొనమిట్ల మేమంతా సిద్ధం సభకు చేరుకున్న బస్సు యాత్ర 
  • కాసేపట్లో సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌ 
  • సభకు భారీగా హాజరైన జనం 
  • పెత్తందారులపై పోరుకు సిద్ధం అని  నినాదాలు  

పెద అరికట్ల చేరుకున్న బస్సు యాత్ర

  • మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం పెద అరికట్ల గ్రామం చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • 43 డిగ్రీల మండుటెండలోనూ తగ్గని జనాల ఉత్సాహం
  • రోడ్డుకు రెండువైపులా బారులు తీరి సీఎం జగన్‌ బస్సుయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు
  • ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన చిన్నారులు, విద్యార్ధులు, యువకులు, మహిళలు, అన్నదాతలు, అవ్వాతాతలు

కదిలి వచ్చిన కనిగిరి

  • జగన్ బస్సుయాత్రకు ప్రజల బ్రహ్మరథం
  • పామూరు బస్టాండ్‌లో సీఎం జగన్‌కు గజమాలతో స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు
  • మండుటెండలోనూ కిక్కిరిసిన కనిగిరి రోడ్లు
  • పూలు చల్లుతూ అభిమాన వర్షం కురిపించినమహిళలు

సీఎం జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్న రామాపురం గ్రామస్తులు

  • మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన రామాపురం గ్రామస్తులు
  • తమ గ్రామంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్.. ఇలా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలందుతున్నాయంటూ రామాపురం గ్రామస్తులు.. సీఎంను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కనిగిరి చేరుకుంది

  • అడుగడునా సీఎం జగన్‌కు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్న ప్రజలు 
  • కనిగిరిలో కొనసాగుతున్న యాత్ర
  • ప్రకాశం జిల్లాలో ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర
  • మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం
  • సీఎం జగన్‌కు అడుగడునా జననీరాజనం
  • దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్‌కు ఆపూర్వ స్వాగతం

నా స్టార్‌ క్యాంపెయినర్లతో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర: సీఎం జగన్‌

  • పదో రోజు ప్రకాశం జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది
  • యాత్రలో కలిసిన పిల్లలు, వృద్ధులు, మహిళలతో సీఎం జగన్‌ ఆప్యాయంగా మాట్లాడారు
  • వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు

జగనన్న కోసం యువ స్టార్ క్యాంపెయినర్

  • కరోనా మహమ్మరి వల్ల తన తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఈ యువకుడి పేరు మునగ అభిరామ్, వయస్సు 18. 
  • తాను ఆనాధను కాదని తనకి జగనన్న ఉన్నారంటూ ఇవాళ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం యాత్రలో కనిపించాడు
  • కోవిడ్ తో తన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, ఆ విషయం తెలుసుకున్న సీఎం జగన్ చిన్న బిడ్డ ఆనాధగా మిగలకూడదని ఆయన ఆ బిడ్డ జీవితానికి ఒక లైఫ్‌లైన్‌గా నిలిచారు. 
  • దాదాపు రూ. 10 లక్షల సీఎం నిధులను కేటాయించి ఆ బిడ్డకు అండగా నిలబడ్డారు. 
  • ఇప్పుడు, అదే బిడ్డ అభిరామ్ సీఎం జగన్‌కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరిగి వచ్చాడు

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది

  • దారిపొడవునా సీఎం జగన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు
  • సీఎం జగన్‌ను చూడటానికి భారీగా తరలివస్తున్న ప్రజానికం

పొన్నలూరు మండలం కే అగ్రహారం చేరుకున్న సీఎం జగన్

  • అగ్రహారంలో భారీ క్రేన్స్‌తో 10 గజమాలలతో స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు

సీఎం జగన్‌ సమక్షంలో చేరికలు

  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకు చెందిన కీలక నేతలు
  • జువ్విగుంటక్రాస్‌ స్టే పాయింట్‌ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారికి వైయస్సార్‌సీపీ కండువాలు వేసిన ముఖ్యమంత్రి
  • వైయస్సార్‌సీపీలోకి చేరిన టీడీపీ బీసీ సాధికార స్టేట్‌ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్‌గౌడ్, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్‌లు.
  • వైయస్సార్‌సీపీలోకి చేరిన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీ వీ ఆర్‌ కె చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్‌ కిరణ్‌లు
  • వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్‌ గౌడ్‌

మరికొద్ది సేపటిలో కె. అగ్రహారానికి చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్

  • సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు గ్రామ ఎంట్రన్స్ వద్దకి భారీగా చేరుకున్న గ్రామస్థులు

జువ్విగుంట క్రాస్ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది.

  • రాత్రి బస పాయింట్  జువ్విగుంట క్రాస్  సీఎం జగన్‌ బస్సు యాత్ర బయలుదేరింది
  • సీఎం జగన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు

సీఎం జగన్‌ సమక్షంలో టీడీపీ నేతలు చేరిక

  • జువ్విగుంట రాత్రి బస వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ చలమోలు అశోక్ గౌడ్

పదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర

  • కే అగ్రహారం వద్ద 10 గజమాలలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు 
  • సీఎం జగన్‌ను చూడటానికి భారీగా చేరుకుంటున్న ప్రజానికం

పదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర

  • ప్రకాశం జిల్లాలో మేమంతి సిద్ధం బస్సు యాత్ర
  • కాసేపట్లో జువ్విగుంట క్రాస్‌ నుంచి బస్సు యాత్ర ప్రారంభం
  • పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్దఅరికట్ల చేరుకోకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
  • అనంతరం చిన్నఅరికట్ల, మూగిచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్‌ చేరుకోనున్న మేమంతా సిద్ధం  బస్సు యాత్ర
  • కొనకనమెట్ల క్రాస్‌ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభ
  • బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
  • అనంతరం  బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్‌ , పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి బస్సు యాత్ర
  • రాత్రికి వెంకటాచలంపల్లిలో బస చేయనున్న సీఎం జగన్‌

ప్రకాశం జిల్లా సిద్ధమా...? 

  • పదో రోజు ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర కోసం సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

  • పదో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగనుంది. 
  •  సీఎం జగన్‌ బస్సు యాత్ర.. జువ్విగుంట క్రాస్  రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది.

మేమంతా సిద్ధం - 10వ రోజు ఆదివారం (ఏప్రిల్ 7) షెడ్యూల్

  • ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు జువ్విగుంట క్రాస్‌లో రాత్రి బస చేసిన ప్రాంతం  నుంచి బయలుదేరుతారు.
  • పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల తరువాత భోజన విరామం తీసుకుంటారు.
  • అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్  చేరుకుని సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
  • సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా  వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు.

తొమ్మిదో రోజు సీఎం జగన్‌ బస్సు యాత్ర సూపర్‌ సక్సెస్‌

  • మీరే మా ఆశ.. మీరే మా శ్వాస అంటూ సీఎం జగన్‌ను చూసేందుకు పోటెత్తిన జనాలు
  • మండుటెండను సైతం లెక్క చేయక..
  • కావలి బహిరంగ సభలో జనసునామీ
  • తన కోసం వచ్చిన వారిని సీఎం జగన్‌ ఆప్యాయంగా పలకరిచి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు
  • చిన్నారులు.. యువతులు.. వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరితో సెల్ఫీలు దిగి వారిలో ఆనందోత్సాహాలను నింపారు

తొమ్మిది రోజుల మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అభిమానం ఇలా..









Advertisement
Advertisement