Sakshi News home page

ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..?

Published Mon, Sep 4 2023 3:34 PM

Congress Response On DMK Leader Sanatana Remark - Sakshi

ఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఉదయనిధిని విమర్శించే క్రమంలో ఇండియా కూటమి స్వభావం ఎంటో స్పష్టమవుతోందని బీజేపీ మండిపడింది. ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. అన్ని మతాలను గౌరవించడమే కాంగ్రెస్ స్వభావమని సీనియర్ నాయకుడు కేసీ వేణు గోపాల్ తెలిపారు. 'సర్వ ధర్మ సమభావన' అని పేర్కొంటూ ఇదే కాంగ్రెస్ ఐడియాలజీ అని పేర్కొన్నారు.

ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రతి రాజకీయ పార్టీకి వాక్ స్వాతంత్య్రం ఉంటుందని చెప్పారు. ఏ మతాన్ని కాంగ్రెస్ విమర్శించబోదని స్పష్టం చేశారు. సమాన అవకాశాలు ఇవ్వని మతమేదైనా వ్యాధితో సమానమని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడిన వెంటనే కాంగ్రెస్‌ ఈ మేరకు స్పందించింది. 

ఇండియా కూటమిలో భాగమైన రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడారు. సనాతన ధర్మం శాశ్వతమైన సత్యాన్ని సూచిస్తుందని అన్నారు. ఆక్రమణదారుల దాడులను తట్టుకుని నిలబడగలిగిందని చెప్పారు. ఇది దేశానికి పునాది అని మాట్లాడారు. అలాంటి ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబు కాదని చెప్పారు. హక్కుల కోసం పోరాడిన అలాంటి సనాతనీయులపై మహారాష్ట్రలో లాఠీ ఛార్జీ చేసిన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు. 

ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్‌ ఏమన్నారంటే..

ఉదయనిధి స్టాలిన్‌ ఏమన్నారంటే..
 సనాతన నిర్మూలన పేరుతో నిర్వహించిన సమావేశంలో  ఉదయనిధి స్టాలిన్‌  హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు.

బీజేపీ మండిపాటు..
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కూడా ఉంది. ముంబయి వేదికగా జరిగిన సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇండియా కూటమిపై బీజేపీ దాడి చేసింది. ముంబయి భేటీలో ఇదే నిర్ణయించారా? అని ప్రశ్నలు గుప్పించారు. 

ఇదీ చదవండి: సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు..


 

Advertisement

What’s your opinion

Advertisement