Sakshi News home page

‘వై నాట్ 175 అనేది.. దెందులూరు సభతో ప్రతిపక్షాలకు అర్థమైంది’

Published Sun, Feb 4 2024 4:42 PM

MLA Abbaya Chowdary Slams On Chandrababu Pawan Kalyan - Sakshi

ఏలూరు: దెందులూరులో శనివారం జరిగిన వైఎ‍స్సార్‌సీపీ ‘సిద్ధం సభ’కు గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగినట్టుగా ప్రజలు తరలివచ్చారని వైఎస్సార్‌సీసీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తామంతా జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయులకు జరిగిన చిన్న అసౌకర్యానికి మన్నించాలని కోరుతున్నామన్నారు. దెందులూరులో జరిగిన ‘సిద్ధం సభ’ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారిందని తెలిపారు.

భీమిలి సభ ట్రైలర్ అయితే నిన్న(శనివారం) దెందులూరు సభతో ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే లబ్ధి చేకూరిందో వారే తమ స్టార్ క్యాంపెనర్లలని సీఎం జగన్‌ సూచించారని అన్నారు. వై నాట్ 175 అనేది.. నిన్నటి సభతో ప్రతిపక్షాలకు అర్థమై ఉంటుందని అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే నినాదం సభలో ప్రజల నోట వినబడిందని తెలిపారు. ఈ 60 రోజులు ప్రతి కార్యకర్త కష్టపడదామని సీఎం జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామని అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు.

ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు నేతలు సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళతాయని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికే హైదరాబాదులో ఉంటున్నారని మండిపడ్డారు. కుప్పం టూ ఇచ్చాపురం మా అభ్యర్థులు ఎవరో చెప్పాం.. మా ఎజెండా ఏంటి.. మా జెండా ఏంటి.. అనేది స్పష్టం చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు కరువై.. ప్రతిపక్షాలు పొత్తులకు వెళుతున్నాయని ఎద్దేవా చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement