ప్రభుత్వ అతిథి గృహాలతో ప్రజాధనం ఆదా  | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అతిథి గృహాలతో ప్రజాధనం ఆదా 

Published Tue, Aug 25 2020 4:03 AM

Muttamsetti Srinivasa Rao Comments On Chandrababu And Lokesh - Sakshi

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రభుత్వ అతిథి గృహాల నిర్మాణంతో ప్రజాధనం ఆదా అవుతుందని, ఆ ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.  

► ప్రధాన నగరాల్లో ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌లు లేకపోవటంతో హోటల్స్‌లో విడిది చేయాల్సి వస్తుంది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుంది.  
► గత ప్రభుత్వం విశాఖలో ప్రొటోకాల్‌ కోసం రూ.కోట్ల ఖర్చు చేసింది. చంద్రబాబు, లోకేశ్‌లు ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో కాకుండా హోటల్స్‌లో ఉండి రూ. 23 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు.  
► తమ ప్రభుత్వంలో అలా జరగకుండా విశాఖ, తిరుపతి, విజయవాడ, కాకినాడల్లో ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లను నిర్మించి ప్రజాధనాన్ని ఆదా చేయబోతున్నాం.  చంద్రబాబు, మాజీ మంత్రి గంటా కలసి తొట్లకొండ వద్ద ఫిల్మ్‌ క్లబ్‌ కట్టడానికి అడుగులు వేశారు. ఇప్పుడు వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారు.  
► ప్రభుత్వ గెస్ట్‌ హౌస్‌ నిర్మించే స్థలానికి తొట్లకొండ, బావి కొండ ప్రాంతాలకు కిలోమీటర్‌ దూరం ఉంది. 126 ఎకరాలను బౌద్ధ స్థూపాల కోసం కేటాయించాం. అక్కడ మెడిటేషన్‌కి సంబంధించిన నిర్మాణాలు తప్ప మరే ఇతర నిర్మాణాలు చేపట్టబోం. మేమంతా సీఎం జగన్‌ ఫొటో పెట్టుకునే గెలిచాం. రఘు
రామకృష్టరాజును చూసి ప్రజలు ఓట్లు వేయలేదు.  సమావేశంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement