మోదీది ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ’.. రాహుల్‌ గాంధీ విమర్శలు | Sakshi
Sakshi News home page

మోదీది ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ’.. రాహుల్‌ గాంధీ విమర్శలు

Published Sun, Mar 31 2024 3:38 PM

Rahul Gandhi attack on BJP over match fixing - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న 400 లోక్‌సభ సీట్ల గెలుపు నినాదంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈడీ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి లోక్‌తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) పేరుతో  చేపట్టిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఈవీఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా, మీడియాపకై ఒత్తిడి పెంచటల చేయకుండా బీజేపీ కనీసం 400 సీట్లు గెలవలేదని అన్నారు. అలా చేయకుండా ఉంటే బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు.

‘ఐపీల్‌ మ్యాచ్‌ల్లో అంపైర్లపై ఒత్తిడి పెంచి, ప్లేయర్లను కొనుగోలు చేసి.. కెప్టెన్లు మ్యాచ్‌ గెలుస్తారు. దీన్ని క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటారు. రాజకీయాల్లోకూడా అలాగే.. లోక్‌ సభ ఎన్నికల్లో ముందు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతుంది. అంపైర్లు ప్రధాని మోదీని ఎంచుకుంటారు. ఇద్దరు ప్లేయర్లను మా టీం నుంచి అరెస్ట్‌ చేస్తారు. పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కోవడానికి ప్రధాని మోదీ, కొంతమంది ధనవంతులు కుట్రతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేస్తున్నారు’ అని రాహుల్‌ గాంధీ సెటైర్లు చేశారు.

‘ఇవి సాధారణ ఎన్నికలు  కావు.  ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలు. భారీ మద్దతు ఓట్లు వేయకపోతే... వాళ్లు(బీజేపీ) మ్యాచ్‌ ఫిక్సింగ్ చేసి మరీ గెలుస్తారు. అప్పడు రాజ్యాంగాన్ని  నాశనం చేస్తారు. రాజ్యాంగం అనేది ప్రజల గొంతుక. ఏదోరోజు ఆ రాజ్యాంగం కనుమరుగు చేస్తారు. అప్పడు దేశం కూడా నాశనం అవుతుంది’ అని రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు.

ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ( శరద్‌ చంద్ర పవార్‌) అధినేత శరద్ పవార్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement